ఐపీఎల్-2026 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో తలపడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తరపున బరిలోకి దిగుతున్న భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
ఆర్సీబీపై భువీ కేవలం రెండు వికెట్లు పడగొడితే.. ఐపీఎల్‌లో 200 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి ఫాస్ట్ బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు కేవలం యుజువేంద్ర చాహల్ (221 వికెట్లు) మాత్రమే 200 వికెట్ల మార్కును దాటాడు. ఇప్పుడు భువనేశ్వర్ కూడా చహల్ సరసన చేరేందుకు సిద్దమయ్యాడు.
కాగా ఈ ఏడాది సీజన్‌కు ఫస్ట్‌హాఫ్‌కు స్టార్ పేసర్లు జోష్ హాజిల్‌వుడ్‌లు అందుబాటులో లేకపోవడంతో ఆర్సీబీ బౌలింగ్ బాధ్యత అంతా భువీపైనే పడింది. పవర్‌ప్లేతో వికెట్లు తీయడంతో పాటు డెత్ ఓవర్లలో పరుగులను కట్టడి చేయడంలోనూ భువీ కీలకం కానున్నాడు. ఇప్పటివరకు భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్‌లో మొత్తంగా 190 మ్యాచ్‌లు 198 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు వీరే
యజ్వేంద్ర చాహల్: 221 వికెట్లు
భువనేశ్వర్ కుమార్: 198 వికెట్లు
సునీల్ నరైన్ : 192 వికెట్లు
పీయూష్ చావ్లా : 192 వికెట్లు
రవిచంద్రన్ అశ్విన్ : 187 వికెట్లు
చదవండి: ఇదేం పద్ధతి?.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఓవరాక్షన్.. నెటిజన్లు ఫైర్


