ఇదేం పద్ధతి?.. పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ ఓవరాక్షన్‌ | Lack of Manners: Pak great Lambasted for embarrassing ex ENG star | Sakshi
Sakshi News home page

ఇదేం పద్ధతి?.. పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ ఓవరాక్షన్‌.. నెటిజన్లు ఫైర్‌

Mar 28 2026 5:15 PM | Updated on Mar 28 2026 5:23 PM

Lack of Manners: Pak great Lambasted for embarrassing ex ENG star

పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ ముస్తాక్‌ అహ్మద్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. మీకసలు కామన్‌సెన్స్‌ ఉందా? అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ డొమినిక్‌ కార్క్‌ పట్ల ముస్తాక్‌ ప్రవర్తించిన తీరే ఇందుకు కారణం.

అసలు విషయం ఏమిటంటే.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)లో క్వెటా గ్లాడియేటర్స్‌- కరాచీ కింగ్స్‌కు మధ్య మ్యాచ్‌కు ముందు పిచ్‌ పరిస్థితుల గురించి చర్చించే క్రమంలో డొమినిక్‌, ముస్తాక్‌ మైదానంలోకి వచ్చారు.

నువ్వు జీనియస్‌
ఈ క్రమంలో పిచ్‌ను చూపిస్తూ.. ‘నువ్వు జీనియస్‌. రెండు చేతులతోనూ బంతిని తిప్పేయగలవు. ఇక్కడ ఆడం జంపా ఉన్నాడు. ఈ పిచ్‌పై బౌలింగ్‌ చేసే విషయంలో అతడికి నువ్వు ఎలాంటి సలహాలు ఇస్తావు?’ అని డొమినిక్‌ ముస్తాక్‌ను అడిగాడు.

ఇందుకు బదులుగా.. ‘ఆడం జంపా కంటే ముందు నీకు ఓ విషయం చెప్పాలి. టెస్టు, వన్డే, ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లలో నేను ఎన్నిసార్లు నిన్ను అవుట్‌ చేశానో గుర్తుందా? నాకైతే ఆ విషయం చాలా బాగా గుర్తుంది’ అని ముస్తాక్‌ పొంతనలేని సమాధానం ఇచ్చాడు.

నన్ను ఒకసారి అవుట్‌ చేశావు
అయితే, డొమినిక్‌ కార్క్‌ .. ‘ముషీ.. నువ్వు నన్ను ఒకసారి అవుట్‌ చేశావు’ అని బదులిచ్చాడు. అయితే, ముస్తాక్‌ మాత్రం.. ‘లేదు.. లేదు.. చాలాసార్లు నిన్ను అవుట్‌ చేశాను’ అని పునరుద్ఘాటించాడు.

ఇందుకు డొమినిక్‌ కార్క్‌.. ‘నేనైతే బ్యాటింగ్‌ చేయలేను కదా!.. నన్ను అవుట్‌ చేసే విషయం గురించి ఇప్పుడెందుకు గానీ.. టాపార్డర్‌పై దృష్టి పెట్టి ఉంటే బాగుండేది’ అని కౌంటర్‌ వేశాడు.

ముందు ఈ పిచ్‌ గురించి మాట్లాడదామా?
అయితే, ముస్తాక్‌ మరోసారి అదే టాపిక్‌ తీసుకువచ్చాడు. ‘నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. నువ్వు ఇంగ్లండ్‌ తరఫున ఆల్‌రౌండర్‌గా ఆడేవాడివి’ అని పేర్కొన్నాడు. దీంతో డొమినిక్‌కు చిర్రెత్తుకు వచ్చింది. ‘మనం ముందు ఈ పిచ్‌ గురించి మాట్లాడదామా? ఆడం జంపా గురించే నేను మాట్లాడదలచుకున్నాను’ అని బదులిచ్చాడు.

వీరిద్దరి సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో డొమినిక్‌ హుందాగా పిచ్‌ గురించి మాట్లాడుతుంటే.. ముస్తాక్‌ మాత్రం అతడిని తక్కువ చేసే విధంగా పాత విషయాలు తవ్వడం ఏమిటని నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు.

ఇదేం పద్ధతి?
‘ఇదేం పద్ధతి? కాస్తైనా సంస్కారం లేదా? పిచ్‌ గురించి అభిప్రాయం చెప్పమంటే ఇలా మాట్లాడటం సరికాదు’ అని చురకలు అంటిస్తున్నారు. కాగా ఇంగ్లండ్‌ తరఫున 37 టెస్టులు, 32 వన్డేలలో కలిపి పేస్‌ బౌలర్‌ డొమినిక్‌ కార్క్‌ 172 వికెట్లు కూల్చాడు. మరోవైపు.. ముస్తాక్‌ పాక్‌ తరఫున 52 టెస్టులు, 144 వన్డేలుఆడి 300కు పైగా వికెట్లు పడగొట్టాడు.

చదవండి: PSL: పాకిస్తాన్‌కు మరో షాక్‌!.. ఈసారి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement