‘డైనమో జాగ్రెబ్’ జట్టులో సౌమ్య

భారత ఫుట్‌బాల్ జట్టు సభ్యురాలు, తెలంగాణకు చెందిన గుగులోత్ సౌమ్యకు అరుదైన అవకాశం దక్కింది. క్రొయేషియాకు చెందిన ప్రతిష్టాత్మక క్లబ్ ‘డైనమో జాగ్రెబ్’ తరఫున ఆమె ఆడనుంది. దీనికి సంబంధించి ఏడాది పాటు ఒప్పందం కుదుర్చుకుంది. సౌమ్యతో పాటు మరో భారత ప్లేయర్ జ్యోతి చౌహాన్‌ను కూడా జాగ్రెబ్ క్లబ్ ఎంచుకుంది.
ఈ టీమ్‌తో జత కట్టిన తొలి విదేశీ ఆటగాళ్లుగా వీరిద్దరు గుర్తింపు పొందారు. క్రొయేషియాలోనే జరిగిన ట్రయల్స్‌లో సత్తా చాటి వీరిద్దరు ఆ అవకాశం దక్కించుకున్నారు. ఇద్దరూ కూడా భారత దేశవాళీ మహిళల లీగ్‌లో గోకులమ్ ఎఫ్‌సీకే ప్రాతినిధ్యం వహించారు. క్రొయేషియాలో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన డైనమో జాగ్రెబ్ 46 ట్రోఫీలు గెలుచుకుంది.
చదవండి: Japan Open 2022: ముగిసిన శ్రీకాంత్ పోరాటం.. బరిలో మిగిలింది ఒకే ఒక్కడు