Japan Open 2022: ముగిసిన శ్రీకాంత్‌ పోరాటం.. బరిలో మిగిలింది ఒకే ఒక్కడు

Japan Open 2022: Kidambi Srikanth Crashes Out After Losing To Kanta Tsuneyama - Sakshi

జపాన్‌ ఓపెన్‌-2022 సూపర్‌ 750 టోర్నీలో భారత షట్లర్ల పోరాటం దాదాపుగా ముగిసింది. ఈ టోర్నీ తొలి రౌండ్‌లోనే స్టార్‌ షట్లర్లంతా ఇంటిముఖం పట్టగా.. గురువారం కిదాంబి శ్రీకాంత్‌ పోరాటం సైతం ముగిసింది. భారత్‌ తరఫున హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ మాత్రమే ఈ టోర్నీ బరిలో మిగిలాడు. పురుషుల సింగిల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో శ్రీకాంత్‌.. జపాన్‌కు చెందిన కంటే సునేయమ చేతిలో 10-21, 16-21 తేడాతో పోరాడి ఓడాడు. అంతకుముందు శ్రీకాంత్‌ తొలి రౌండ్‌లో వరల్డ్‌ నంబర్‌ 4 ఆటగాడు లీ జీ జియాకు షాకిచ్చి ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించాడు.   

ఇక టోర్నీ బరిలో నిలిచిన ఏకైక భారత ఆటగాడు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ విషయానికొస్తే.. ఈ మాజీ వరల్డ్‌ నంబర్‌ 8 షట్లర్‌ ప్రీక్వార్టర్స్‌లో సింగపూర్‌ ఆటగాడు, మాజీ వరల్డ్‌ ఛాంపియన్‌ లో కియాన్‌ యును వరుస సెట్లలో (22-20 21-19) ఖంగుతినిపించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ప్రణయ్‌ తదుపరి రౌండ్‌లో తైపీ షట్లర్‌ చౌ టెన్‌ చెన్‌ను ఢీకొట్టాల్సి ఉంది. కాగా, ఈ టోర్నీ బరిలో భారత తురుపు ముక్క పీవీ సింధు బరిలో దిగని విషయం తెలిసిందే.  
చదవండి: వరల్డ్‌ నంబర్‌ 4కు షాకిచ్చిన శ్రీకాంత్.. సైనా, లక్ష్యసేన్‌ ఔట్‌
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top