ఎట్టకేలకు.. శ్రేయస్‌ అయ్యర్‌ విధ్వంసం! వీడియో వైరల్‌ | Shreyas Iyer ends 14-month-long wait for first-class fifty | Sakshi
Sakshi News home page

#Shreyas Iyer: ఎట్టకేలకు.. శ్రేయస్‌ అయ్యర్‌ విధ్వంసం! వీడియో వైరల్‌

Mar 12 2024 3:34 PM | Updated on Mar 12 2024 3:41 PM

Shreyas Iyer ends 14-month-long wait for first-class fifty - Sakshi

టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌, ముంబై ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ ఎట్టకేలకు బ్యాట్‌ ఝుళిపించాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో భాగంగా విధర్బ జరుగుతున్న ఫైనల్లో అయ్యర్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ తుది పోరు సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 111 బంతులు ఎదుర్కొన్న అయ్యర్‌.. 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 95 పరుగులు చేశాడు.

దూకుడుగా ఆడిన అయ్యర్‌ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కాగా అయ్యర్‌ ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో విఫలమై భారత జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. జట్టులో చోటు మాత్రమే కాకుండా బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ను సైతం శ్రేయస్‌ కోల్పోయాడు. తొలుత రంజీట్రోఫీలో ఆడేందుకు అయ్యర్‌ విముఖత చూపించడంతో అయ్యర్‌ను కాంట్రాక్ట్‌ నుంచి బీసీసీఐ తప్పించింది.

అయ్యర్‌తో పాటు మరో యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌పై కూడా బీసీసీఐ వేటు వేసింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన ముంబై.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం భారీ స్కోర్‌ దిశగా దూసుకుపోతోంది. 114 ఓవర్లకు సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ముంబై 7 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. ఓవరాల్‌గా ముంబై ప్రస్తుతం 483 ఆధిక్యంలో కొనసాగుతోంది. ముంబై బ్యాటర్లలో అయ్యర్‌తో పాటు ముషీర్‌ ఖాన్‌(136) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement