ఐపీఎల్‌లోనూ కొనసాగుతున్న షమీ హవా | SHAMI HAS ARRIVED IN IPL 2026, WICKET IN THE FIRST BALL | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌లోనూ కొనసాగుతున్న షమీ హవా

Apr 1 2026 10:24 PM | Updated on Apr 2 2026 9:48 AM

SHAMI HAS ARRIVED IN IPL 2026, WICKET IN THE FIRST BALL

భారత స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ హవా ఐపీఎల్‌లోనూ కొనసాగింది. 2026 ఎడిషన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ట్రేడ్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌ నుంచి) అయిన అతను.. ఈ ఫ్రాంచైజీ తరఫున తొలి బంతికే వికెట్‌ తీసి ఔరా అనిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 1) జరుగుతున్న మ్యాచ్‌లో తొలిసారి లక్నో తరఫున బరిలోకి దిగిన షమీ.. 142 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఇన్నింగ్స్‌ తొలి బంతికే వికెట్‌ తీశాడు. షమీ దెబ్బకు ఢిల్లీ స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ గోల్డన్‌ డకౌటయ్యాడు.

కడపటి వార్తలు అందే సరికి 142 పరుగుల ఛేదనలో ఢిల్లీ తడబడుతుంది. 8 ఓవర్లలో 53 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. షమీ తన కోటాలో 3 ఓవర్లు పూర్తి చేసి 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఢిల్లీపై లక్నో బౌలర్లు ముప్పేట దాడి చేస్తున్నారు. షమీ ఓ పక్క.. ప్రిన్స్‌ యాదవ్‌ (2-0-14-2), మొహిసిన్‌ ఖాన్‌ (2-1-2-1) ఎండ్‌ నుంచి ఢిల్లీపై ఎదురుదాడి చేస్తున్నారు. 

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలవాలంటే మరో 72 బంతుల్లో 89 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు మాత్రమే ఉన్నాయి. సమీర్‌ రిజ్వి (11), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (12) ఢిల్లీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. నిస్సంక (1), అక్షర్‌ పటేల్‌ (0) వికెట్లు ప్రిన్స్‌ యాదవ్‌ తీయగా.. నితీశ్‌ రాణాను (15) మొహిసిన్‌ ఖాన్‌ బోల్తా కొట్టించాడు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన లక్నో 141 పరుగులకే కుప్పకూలింది. నటరాజన్‌ (4-0-29-3), ఎంగిడి (3.4-0-27-3), కుల్దీప్‌ యాదవ్‌ (4-0-31-2), అక్షర్‌ పటేల్‌ (3-0-17-1) లక్నో పతనాన్ని శాశించారు. లక్నో ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు.అబ్దుల్‌ సమద్‌ (36), మిచెల్‌ మార్ష్‌ (35) పర్వాలేదనిపించారు.

దేశవాలీ క్రికెట్‌లో షమీ హవా
టీమిండియా బెర్త్‌ లక్ష్యంగా షమీ దేశవాలీ క్రికెట్‌లో ఫార్మాట్లకతీతంగా చెలరేగుతున్నాడు. తాజా సీజన్‌లో అతను రంజీ ట్రోఫీలో 13 ఇన్నింగ్స్‌ల్లో 37 వికెట్లు.. విజయ్‌ హజారే ట్రోఫీలో 7 ఇన్నింగ్స్‌ల్లో 15 వికెట్లు.. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో 7 ఇన్నింగ్స్‌ల్లో 16 వికెట్లు తీశాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement