'Even though he went back home, he was in regular touch with me' - Sai Sudharsan on Kane Williamson - Sakshi
Sakshi News home page

#SaiSudharsan: 'నా సక్సెస్‌లో సగం క్రెడిట్‌ కేన్‌మామదే'

Published Thu, Jun 15 2023 12:45 PM

Sai Sudharsan On-Kane Williamson Even-Went Back Home Regular Touch - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ప్లేయర్‌ సాయి సుదర్శన్‌ ఒక సంచలనం. ముఖ్యంగా సీఎస్‌కేతో జరిగిన ఐపీఎల్‌ ఫైనల్లో సాయి సుదర్శన్‌ 47 బంతుల్లోనే 96 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అంతకముందు ముంబై ఇండినయ్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లోనూ 43 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ సీజన్‌లో ఆడే అవకాశం తక్కువగా వచ్చినప్పటికి అందివచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకున్నాడు సాయి సుదర్శన్‌. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో సాయి సుదర్శన్‌ 8 ఇన్నింగ్స్‌లు ఆడి 362 పరుగులు సాధించాడు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌(టీఎన్‌ఎపీల్‌ 2023)లో బిజీగా ఉన్న సాయి సుదర్శన్‌ పీటీఐకి ఇంటర్య్వూ ఇచ్చాడు. తన సక్సెస్‌లో సగం క్రెడిట్‌ న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌దే అని తెలిపాడు. ఇక కేన్‌ విలియమ్సన్‌ ఈ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే గాయపడిన కేన్‌ విలియమ్సన్‌ స్వదేశానికి వెళ్లిపోయాడు.

''నా షాట్ల ఎంపికలో కొత్తదనం కనిపిస్తుంటే అది కేన్‌ విలియమ్స్‌న్‌ వల్లే. గాయంతో కేవలం ఒక్క మ్యాచ్‌కు మాత్రమే పరిమితమయి స్వదేశానికి వెళ్లినప్పటికి కేన్‌ మామతో నిత్యం టచ్‌లో ఉన్నా. బ్యాటింగ్‌లో టిప్స్‌తో పాటు కొంత ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చేవాడు. అంతేకాదు ఒక గేమ్‌లో ఇన్నింగ్స్‌ డీప్‌గా ఎలా ఆడాలనేదానిపై.. లిమిటేషన్స్‌ లేకుండా ఆటపై పట్టు ఎలా సాధించాలనే దానిపై సూచనలు ఇచ్చాడు.

ఐపీఎల్‌ 2023 సీజన్‌ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్‌ సమయంలో అతను ఎంపిక చేసుకున్న షాట్స్‌ను గమనించేవాడిని. అతను మూడు ఫార్మాట్లలోనూ ఆడగల సమర్థుడు. అలాంటి ప్లేయర్‌ నుంచి బ్యాటింగ్‌లో బెటర్‌గా ఆడడం ఎలా అని నేర్చుకోవడం నాకు పెద్ద విషయం. ఇక మాథ్యూ వేడ్‌ పాడిల్‌, స్కూప్‌ షాట్స్‌ ఎలా ఆడాలో నేర్పించాడు.'' అంటూ తెలిపాడు.

చదవండి: కౌంటీల్లో సరికొత్త చరిత్ర.. 501 పరుగుల టార్గెట్‌ను ఊదేశారు

'బూడిద' కోసం 141 ఏళ్లుగా.. 'యాషెస్‌' పదం ఎలా వచ్చిందంటే?

Advertisement

తప్పక చదవండి

Advertisement