
ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లిని తిరిగి గాడిలో పెట్ట గల ఏకైక వ్యక్తి సచిన్ టెండూల్కర్ మాత్రమే అని భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా అభిప్రాయపడ్డాడు. కోహ్లి ప్రస్తుతం అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో మూడెంకెల స్కోర్ సాధించి దాదాపు మూడేళ్ల దాటుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 18 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 459 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ ఏడాది అతడి ఇన్నింగ్స్‌లలో అత్యధిక స్కోర్ 79 పరుగులు మాత్రమే.
"కోహ్లి విషయంలో సచిన్ జోక్యం చేసుకోవాలని నేను 8 నెలల క్రితమే చెప్పాను. సచిన్ కోహ్లితో కలిసి మాట్లాడాలి. ఎందుకంటే 14 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ ఆడటంప్రారంభించిన సచిన్.. తన కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూశాడు. కాబట్టి కోహ్లి విషయంలో సచిన్ మాత్రమే సరైన వ్యక్తి అని నేను భావిస్తాను.
ఒకే వేళ సచిన్‌తో మాట్లాడానికి విరాట్ సంకోచించినా.. సచిన్ మాత్రం తనంతట తానే అతడి విషయంలో జోక్యం చేసుకోవాలి. ఇక ఏ ఆటగాడైనా ఏదో ఒక సమయంలో ఇలాంటి గడ్డు కాలాన్ని అనుభవించక తప్పదు. మనం అనుభవం ఉన్న ఆటగాళ్లం కాబట్టి యువ ఆటగాళ్లతో చర్చించాల్సిన బాధ్యత ఉంటుంది. విరాట్‌ను తిరిగి ఫామ్‌లోకి తీసుకురావడానికి మాస్టర్ బ్లాస్టర్ తన వంతు కృషి చేస్తాడు భావిస్తున్నా" అని అజయ్ జడేజా పేర్కొన్నాడు.
చదవండి: బాబర్ ట్వీట్‌కు కోహ్లి తప్పకుండా రిప్లై ఇవ్వాలి: షాహిద్ అఫ్రిది