ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే రాజస్థాన్ రాయల్స్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చిన రియాన్ పరాగ్ ఓ భారీ కెప్టెన్సీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి సీజన్‌లోనే తన జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చిన 24వ సారధిగా రికార్డుల్లోకెక్కాడు. తద్వారా లెజెండరీ కెప్టెన్లు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ సరసన చేరాడు.
కెప్టెన్‌గా మొదటి సీజన్‌లో తమ జట్లను ప్లే ఆఫ్స్‌కు చేర్చిన కెప్టెన్లు
షేన్ వార్న్ - RR, 2008
యువరాజ్ సింగ్ - KXIP, 2008
ఎంఎస్ ధోని - CSK, 2008
వీరేంద్ర సెహ్వాగ్ - DC, 2008
అనిల్ కుంబ్లే -RCB, 2009
డేనియల్ వెట్టోరి - RCB, 2011
గౌతమ్ గంభీర్ - KKR, 2011
హర్భజన్ సింగ్ - MI, 2012
రోహిత్ శర్మ - MI, 2013
కెమరాన్ వైట్ - SRH, 2013
జార్జ్ బెయిలీ - KXIP, 2014
స్టీవ్ స్మిత్ - RR, 2015
సురేష్ రైనా - GL, 2016
కేన్ విలియమ్సన్ - SRH, 2018
దినేష్ కార్తీక్ - KKR, 2018
అజింక్యా రహానే - RR, 2018
రిషబ్ పంత్ - DC, 2021
హార్దిక్ పాండ్యా - GT, 2022
ఫాఫ్ డు ప్లెసిస్ - RCB, 2022
కేఎల్ రాహుల్ - LSG, 2022
కృనాల్ పాండ్యా - LSG, 2023
పాట్ కమిన్స్ - SRH, 2024
రజత్ పాటిదార్ - RCB, 2025
రియాన్ పరాగ్ - RR, 2026
కాగా, గత సీజన్ వరకు రాజస్థాన్ కెప్టెన్‌గా వ్యవహరించిన సంజూ శాంసన్ సీఎస్‌కేకు ట్రేడ్ కావడంతో.. ఈ సీజన్‌తోనే రియాన్ పరాగ్ ఫుల్ టైమ్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రియాన్.. సీజన్ ఆరంభంలో జట్టును అద్భుతంగా ముందుండి నడిపించాడు. మధ్యలో తడబడినా, చివరికి మళ్లీ పుంజుకొని తన జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు.
ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో (ముంబై ఇండియన్స్) రాజస్థాన్ జట్టు అన్ని విభాగాల్లో సత్తా చాటి అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో నాలుగో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకొని ఎలిమినేటర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో అమీతుమీకి సిద్దమైంది.
తొలి మూడు ప్లే ఆఫ్స్ బెర్త్‌లను దక్కించుకున్న జట్లుగా ఆర్సీబీ, గుజరాత్, ఎస్‌ఆర్‌హెచ్ ఉన్నాయి. ఇవాళ (మే 26) జరిగే క్వాలిఫయర్-1లో టాప్-2 జట్లు ఆర్సీబీ-గుజరాత్ తలపడనుండగా.. రేపు (మే 27) జరుగబోయే ఎలిమినేటర్‌లో ఎస్‌ఆర్‌హెచ్-రాజస్థాన్ ఢీకొంటాయి.
క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో పోటీపడుతుంది. క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టు, క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు ఫైనల్లో టైటిల్ కోసం పోరాడతాయి.
బ్యాటర్‌గా విఫలం
కెప్టెన్‌గా మెప్పించిన రియాన్, బ్యాటర్‌గా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 12 మ్యాచ్‌ల్లో కేవలం 272 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్‌రేట్ బాగానే ఉన్నప్పటికీ, అతడి నుంచి భారీ ఇన్నింగ్స్‌లు రావాలని జట్టు ఆశించింది.


