వైభవ్‌ను చూసి నేర్చుకో పంత్‌..! | Rishabh Pant Told To Learn From Vaibhav Suryavanshi In IPL 2026 | Sakshi
Sakshi News home page

వైభవ్‌ సూర్యవంశీని చూసి నేర్చుకో పంత్‌..!

Apr 2 2026 6:44 PM | Updated on Apr 2 2026 7:04 PM

Rishabh Pant Told To Learn From Vaibhav Suryavanshi In IPL 2026

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 1) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ వ్యక్తిగతంగా, కెప్టెన్‌గా దారుణంగా నిరాశపరిచాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి 9 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి రనౌటయ్యాడు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో బౌలర్లు అద్భుతమైన బ్రేక్‌ ఇచ్చినా, పంత్‌ తన పేలవ నిర్ణయాలతో గెలిచే అవకాశమున్న మ్యాచ్‌ను జారవిడిచాడు. పంత్‌ వ్యక్తిగతంగా, కెప్టెన్‌గా విఫలం​ కావడంపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ ఘాటుగా స్పందించాడు. ఓ పక్క సలహాలు ఇస్తూనే, మరోపక్క తలంటాడు.

వాన్‌ మాటల్లో.. పంత్‌కు ఉన్న ప్రతిభతో ఏ దేశ క్రికెట్‌ జట్టులోనైనా స్థానం సంపాదించగలడు. టీమిండియాలోనే కాస్త కష్టం. ఎందుకంటే, ప్రస్తుత భారత జట్టులో ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌, జితేష్‌ శర్మ లాంటి మెరికలు ఉన్నారు. వీరితో పోటీ పడి నెగ్గుకు రావడం పంత్‌కు అంత ఈజీ కాదు.

పంత్‌ మరో నిరుత్సాహకరమైన ఐపీఎల్‌ సీజన్‌ను భరించలేడు. అతను బ్యాటింగ్‌, కెప్టెన్సీ రెండింటిలోనూ మెరుగుపడాలి. నేను అతని స్థానంలో ఉంటే వైభవ్‌ సూర్యవంశీని గమనించేవాడిని. వైభవ్‌ ఆడే తీరు పంత్‌ను గుర్తు చేస్తుంది. పంత్‌ కెరీర్‌ తొలినాళ్లలో చాలా ధైర్యంగా ఆడేవాడు. ఇప్పుడా ధైర్యం కనిపించడం లేదు.

ముందుగా పంత్‌ తన మైండ్‌ సెట్‌ను మార్చుకోవాలి. ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేసినా 40-45 బంతుల్లో సెంచరీ చేయగలననే ధీమాతో ఆడాలి.

నెక్స్ట్‌ టాస్క్‌ ఎస్‌ఆర్‌హెచ్‌
లక్నో సూపర్‌ జెయింట్స్‌కు నెక్స్ట్‌ టాస్క్‌ ఎస్‌ఆర్‌హెచ్‌. ఏప్రిల్‌ 5న హైదారాబాద్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లోనైనా పంత్‌ ఫామ్‌లోకి రావాలి. లేని ప్రయోగాలకు పోకుండా తన రెగ్యులర్‌ బ్యాటింగ్‌ స్థానంలోనే బరిలోకి దిగాలి. కెప్టెన్సీలోనూ చాలా మెరుగుపడాలి. ఒకవేళ తొలి మ్యాచ్‌ ప్రదర్శనే ఆ మ్యాచ్‌లో కూడా కొనసాగితే, పంత్‌కు కష్టాలు తప్పవు.

వైభవ్‌ సూర్యవంశీ విషయానికొస్తే.. ఈ రాజస్థాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు తమ తొలి మ్యాచ్‌లోనే ఉగ్రరూపం ప్రదర్శించాడు. సీఎస్‌కేపై 15 బంతుల్లోనే అర్ద సెంచరీ చేసి తన జట్టును గెలిపించాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement