IPL 2023: శ్రీలంక వేదికగా ఆసియా కప్‌.. పాపం పాకిస్తాన్‌!

Reports: Asia Cup 2023 could be held in Sri Lanka following Indias dispute with Pakistan - Sakshi

ఆసియా కప్‌-2023 నిర్వహణపై మరోసారి చర్చ మొదలైంది. ఈ ఏడాది ఆసియా కప్‌ను పాకిస్తాన్‌లో కాకుండా శ్రీలంక వేదికగా నిర్వహించనున్నట్టు సమాచారం. కాగా షెడ్యూల్‌ ప్రకారం ఈ మెగా టోర్నీని పాకిస్తాన్‌ నిర్వహించాల్సి ఉంది. కానీ భారత్‌-పాక్‌ దేశాల మధ్య  రాజకీయ ఉద్రిక్తతల కారణంగా తమ జట్టును పంపించేందుకు బీసీసీఐ నిరాకరించింది.

ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్ లో టోర్నీ నిర్వహిస్తే తాము వెళ్లబోమని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్‌సీ),  బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డులు బీసీసీఐకి మద్దతు తెలిపాయి.

దీంతో ఆసియాకప్‌ను తటస్థ వేదికపై నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్‌ ప్రకారం.. ఆసియా కప్‌ నిర్వహణ వేదికపై ఈ నెలాఖరున ఆసియా క్రికెట్ కౌన్సిల్  తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: సచిన్‌ నన్ను బ్యాట్‌తో కొట్టాడు.. పిచ్చివాడిని చేస్తావా అంటూ ఫైర్‌ అయ్యాడు: సెహ్వాగ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top