Jasprit Bumrah: సర్జరీ విజయవంతం.. బుమ్రా రీఎంట్రీ అప్పుడే!

Report:Jasprit Bumrah Undergo Back Surgery Successfully-New Zealand - Sakshi

టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రా వెన్ను నొప్పి కారణంగా ఆటకు దూరమైన విషయం తెలిసిందే. ఇటీవలే బీసీసీఐ వెన్నునొప్పికి సంబంధించిన శస్త్ర చికిత్స కోసం బుమ్రాను న్యూజిలాండ్‌కు పంపిచింది. జోఫ్రా ఆర్చర్‌‌ (ఇంగ్లండ్‌‌), షేన్‌‌ బాండ్‌‌ల(న్యూజిలాండ్‌‌)కు సర్జరీ చేసిన డాక్టర్‌‌ రోవన్‌‌ షౌటెన్‌‌.. బుమ్రాకు చికిత్స అందించాడు. ఈ నేపథ్యంలోనే బుమ్రాకు సర్జరీ విజయంవంతం అయినట్లు సమాచారం అందింది.

సర్జరీ సక్సెస్‌ అయినప్పటికి బుమ్రా పూర్తిగా కోలుకొని గ్రౌండ్ లోకి అడుగుపెట్టడానికి దాదాపు ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. దీంతో బుమ్రా డబ్ల్యూటీసీ ఫైనల్, ఆసియా కప్ లకు దూరం కానున్నాడు. పూర్తి ఫిట్ నెస్ సాధిస్తే అక్టోబర్, నవంబర్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడే అవకాశం దక్కొచ్చు.

ఇక గత ఆగస్టులో గాయపడ్డ బుమ్రా అప్పటి నుంచి ఆటకు దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్-2022, టి20 వరల్డ్ కప్.. తాజాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వంటి కీలక టోర్నీలకు కూడా బుమ్రా దూరమయ్యాడు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ టోర్నీకి కూడా అందుబాటులో ఉండటం లేదు.

బుమ్రా దూరమవడం ముంబై ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. సర్జరీ పూర్తైన బుమ్రా కనీసం 24 వారాలపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే స్వదేశంలో ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్‌ వరకు అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ పేర్కొంది.

చదవండి: మాస్టర్‌మైండ్‌.. తెలివిగా తప్పించుకున్న ధోని

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top