నా డ్రింక్ ఎందుకు తాగావు? | RCB Captain Rajat Patidar Fumes At Umpire, | Sakshi
Sakshi News home page

IPL 2026: నా డ్రింక్ ఎందుకు తాగావు?

Apr 6 2026 5:49 PM | Updated on Apr 6 2026 5:51 PM

RCB Captain Rajat Patidar Fumes At Umpire,

ఐపీఎల్‌-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ జోరు కొనసాగిస్తోంది. ఆర్సీబీ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. ఈ విజయంతో పాటిదార్ సేన పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది.

ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు సీఎస్‌కే ముందు 251 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ కొండంత లక్ష్యాన్ని చేధించలేక సీఎస్‌కే 207 పరుగులకు ఆలౌటైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా ఓ ఆశ్చ‌ర్య‌క‌ర‌ సంఘటన చోటు చేసుకుంది.

ఏమి జరిగిందంటే?
ర‌జ‌త్ పాటిదార్‌, దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ క్రీజులో ఉన్న‌ప్పుడు ఆర్సీబీ సెకెండ్ డ్రింక్స్ బ్రేక్‌ను తీసుకుంది. సాధార‌ణంగా డ్రిక్స్ బ్రేక్ స‌మ‌యంలో  కోచ్‌లు వ్యూహాలు పంచుకోవడానికి మైదానంలోకి వస్తుంటారు. ఈ క్ర‌మంలో ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్ల‌వ‌ర్‌, బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్‌.. త‌మ బ్యాట‌ర్లు పాటిదార్‌, ప‌డిక్క‌ల్ కోసం డ్రింక్స్ తీసుకుని మైదానంలో లోప‌లికి వ‌చ్చారు. అయితే ఇక్క‌డే ఓ వింత సంఘ‌ట‌న చోటు చేసుకుంది. 

పాటిదార్ కోసం తీసుకొచ్చిన డ్రింక్ బాటిల్‌ను అంపైర్ తీసుకుని తాగాడు. ఇది చూసిన పాటిదార్ వెంట‌నే అంపైర్ దగ్గరకు వెళ్లి తన బాటిల్ తనకు ఇచ్చేయమని అడిగాడు. దినేష్ కార్తీక్ కూడా అంపైర్‌తో కాస్త సీరియ‌స్‌గానే మాట్లాడాడు. ఆ పక్కనే ఉన్న ఆండీ ఫ్లవర్ ఇదంతా చూస్తూ సైలెంట్‌గా ఉన్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. అయితే నెటిజ‌న్లు కాస్త భిన్నంగా స్పందిస్తున్నారు. కొంత మంది ఈ ఘ‌ట‌న‌ను హాస్యస్పదంగా తీసుకుంటుంటే, మ‌రికొంత మంది పాటిదార్‌, కార్తీక్ తీరును త‌ప్పుబ‌డుతున్నారు.
చదవండి: IPL 2026: రూ. 28 కోట్లు దండగేనా? చీప్‌గా దొరికాడు.. చితక్కొడుతున్నాడు!

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement