
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దుమ్ములేపాడు. ది ఓవల్‌లో జరుగుతున్న ఐదో టెస్టులోనూ జడ్డూ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో జడేజా కీలక హాఫ్ సెంచరీ సాధించాడు.
77 బంతుల్లో 5 ఫోర్లతో 53 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో అతడికిది ఆరో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. మొత్తంగా ఈ సిరీస్‌లో జడేజా 516 పరుగులతో పాటు 7 వికెట్లు పడగొట్టాడు. తద్వారా జడేజా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
జడేజా సాధించిన రికార్డులు ఇవే..
👉ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్టు సిరీస్‌లో ఆరు లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్‌కు వచ్చి 6 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా జడ్డూ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ గ్యారీ సోబర్స్ పేరిట ఉండేది. గ్యారీ సోబర్స్ 1966లో ఇంగ్లండ్ పర్యటనలో ఒకే సిరీస్‌లో ఐదు హాఫ్ సెంచరీలు సాధించారు. తాజా మ్యాచ్‌తో సోబర్స్ రికార్డును జడ్డూ బ్రేక్ చేశాడు.
👉అదేవిధంగా ఓ టెస్టు సిరీస్‌లో ఆరు లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా సర్ రవీంద్ర జడేజా నిలిచాడు. జడేజా ఈ సిరీస్‌లో 516 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం వివిఎస్ లక్ష్మణ్ పేరిట ఉండేది. 2002లో వెస్టిండీస్‌తో సిరీస్‌లో లక్ష్మణ్ 474 పరుగులు చేశాడు.
👉ఇంగ్లండ్ గడ్డపై ఒక సిరీస్‌లో అత్యధికసార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా జడేజా( 6 సార్లు) నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత లెజెండ్ సునీల్ గవాస్కర్ పేరిట ఉండేది. గవాస్కర్ 1979లో ఇంగ్లండ్ పర్యటనలో ఒకే సిరీస్‌లో 5 సార్లు ఏభైకి పైగా స్కోర్లు నమోదు చేశాడు.
తొమ్మిది వికెట్ల దూరంలో..
కాగా ఓవల్ టెస్టులో భారత్ గెలిచేందుకు 9 వికెట్ల దూరంలో నిలిచింది. 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 50 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: WCL: డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ.. ఫైనల్లో పాక్ చిత్తు! టైటిల్ సౌతాఫ్రికాదే