టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్‌.. ఓ బ్యాడ్‌ న్యూస్‌!? | Sakshi
Sakshi News home page

IND vs ENG: టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్‌.. ఓ బ్యాడ్‌ న్యూస్‌!?

Published Tue, Jan 30 2024 3:13 PM

Ravindra Jadeja to be ruled out of England Test series: Reports - Sakshi

వైజాగ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో టెస్టుకు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్ద తగిలిన సంగతి తెలిసిందే. స్టార్‌ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్‌ రాహుల్‌ గాయాల కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యారు.

కాగా రెండో టెస్టుకు దూరమైన జడేజా.. ఇప్పుడు సిరీస్‌ మొత్తానికి దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో నాలుగో రోజు ఆటలో వేగంగా పరిగెత్తిన జడేజాకు తొడకండరాలు పట్టేశాయి.

అతడు నొప్పితో బాధపడుతూనే మైదానాన్ని వీడాడు. అయితే జడేజా గాయం తీవ్రత ఎక్కువ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌ల నుంచి జడ్డూను తప్పించాలని మేనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. "జడేజా తిరిగి ఈ సిరీస్‌కు అందుబాటులోకి రాకపోవచ్చు. అతడి గాయం కాస్త తీవ్రమైనదిగా అనిపిస్తోంది.

రాహుల్‌ గాయం మాత్రం అంత తీవ్రమైనది కాదు. అతడు తిరిగి సిరీస్‌లో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్‌ ఉంది. ఏదైమనప్పటికీ ఏన్సీఏ వైద్య బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం జట్టు మేనెజ్‌మెంట్‌ ఓ నిర్ణయం తీసుకుంటుందని" బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో పేర్కొన్నారు. ఇక ఇప్పటికే వీరిద్దరి గైర్హజరీలో రెండో టెస్టుకు సర్ఫారాజ్‌ ఖాన్‌, సౌరభ్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌లను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది.
చదవండిచాలా సంతోషంగా ఉంది.. సంబరాలకు రెడీ అవ్వు సర్ఫరాజ్‌: సూర్య

Advertisement
 
Advertisement