పాకిస్తాన్‌ ఆటగాడితో డ్రెస్సింగ్‌ రూమ్‌ షేర్‌ చేసుకోనున్న అశ్విన్‌ | Ravichandran Ashwin Becomes Haris Rauf’s Teammate | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ ఆటగాడితో డ్రెస్సింగ్‌ రూమ్‌ షేర్‌ చేసుకోనున్న అశ్విన్‌

Mar 28 2026 7:45 PM | Updated on Mar 28 2026 7:53 PM

Ravichandran Ashwin Becomes Haris Rauf’s Teammate

భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన స్పిన్నర్లలో ఒకరైన రవిచంద్రన్ అశ్విన్, ఐపీఎల్ మరియు అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్ అయిన తర్వాత మరో ఫ్రాంచైజీ లీగ్‌లోకి అడుగుపెట్టాడు. గతేడాది బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడే కల గాయం కారణంగా నెరవేరకపోయినా, ఈసారి అమెరికాలోని మేజర్ లీగ్ క్రికెట్ (MLC)తో ఒప్పందం కుదుర్చుకొని, విదేశీ లీగ్‌ల్లో ఆడాలన్న కలను సాకారాం చేసుకోనున్నాడు.  

MLCలోని శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌ జట్టు ఆశ్విన్‌తో ఒప్పందం చేసుకుంది. దీంతో ఈ లీగ్‌లో ఆడే తొలి భారతీయ క్యాప్డ్‌ ప్లేయర్‌గా అశ్విన్‌ చరిత్ర సృష్టించాడు. ఈ జట్టులో ఇప్పటికే పాకిస్తాన్ ఫాస్ట్‌ బౌలర్ హారిస్ రౌఫ్ ఉన్నాడు. దీంతో ఇద్దరూ ఒకే డ్రెస్సింగ్ రూమ్‌ను షేర్‌ చేసుకోనున్నారు.  

భారత అభిమానులు లక్ష్యంగా..!  
MLC ఇప్పటికే ఫాఫ్ డుప్లెసిస్, కీరన్ పోలార్డ్, ట్రెంట్ బౌల్ట్ వంటి స్టార్ ఆటగాళ్లను కలిగి ఉంది. అశ్విన్ వంటి భారత లెజెండ్ కూడా చేరడం వల్ల ఈ లీగ్ బ్రాండ్ ఇమేజ్‌ మరింత పెరుగనుంది. అశ్విన్‌ చేరికతో ఈ లీగ్‌ను ఫాలో అయ్యే భారత అభిమానుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది.

BBL, ILT20లో విఫలయత్నాలు  
అంతర్జాతీయ క్రికెట్‌, ఐపీఎల్‌ రిటైర్మెంట్ తర్వాత అశ్విన్‌ విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు పలు విఫలయత్నాలు చేశాడు.  ILT20 వేలంలో పేరు నమోదు చేసుకున్నా, ఆశ్చర్యకరంగా ఎవరూ అతనిపై ఆసక్తి చూపలేదు. బీబీఎల్‌లో సిడ్నీ థండర్‌ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నా, గాయం కారణంగా  సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు.  

IPL 2026లో వ్యాఖ్యాతగా..
అశ్విన్‌ ఆటగాడిగా ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినా, వ్యాఖ్యాతగా కొనసాగనున్నాడు. JioHotstar హిందీ కామెంటరీ ప్యానెల్‌లో వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, అనిల్ కుంబ్లే, రవి శాస్త్రి, సునీల్ గవాస్కర్‌లతో కలిసి పని చేయనున్నాడు. ఆటపై లోతైన అవగాహన కలిగిన అశ్విన్ వ్యాఖ్యాతగా అభిమానులకు కొత్త అనుభవాన్ని అందించనున్నాడు.  

 

Advertisement
 
Advertisement
Advertisement