సన్‌రైజర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం | IPL 2026 Match 1: RCB vs SRH Updates and Highlights | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం

Mar 28 2026 7:02 PM | Updated on Mar 28 2026 11:08 PM

IPL 2026 Match 1: RCB vs SRH Updates and Highlights

ఐపీఎల్‌ 2026 ఓపెనింగ్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్సీబీ ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలో ఊదేసి, 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

బౌలింగ్‌లో డఫీ (4-0-22-3).. బ్యాటింగ్‌లో పడిక్కల్‌ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్‌ కోహ్లి (38 బంతుల్లో 69 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అదరగొట్టారు. అంతకుముందు ఇషాన్‌ కిషన్‌ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం, అనికేత్‌ వర్మ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపుల కారణంగా సన్‌రైజర్స్‌ భారీ స్కోర్‌ చేసింది. 

వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ
ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో ఆర్సీబీ వరుస బంతుల్లో (2,3) వికెట్లు కోల్పోయింది. డేవిడ్‌ పేన్‌ వరుసగా రజత్‌ పాటిదార్‌ (31), జితేశ్‌ శర్మ (0)ను ఔట్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవాలంటే 45 బంతుల్లో 39 పరుగులు చేయాలి. 

రెండో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
8.4వ ఓవర్‌-110 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్‌ కోల్పోయింది. విధ్వంసకర అర్ద శతకం బాదిన పడిక్కల్‌ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) హర్ష్‌ దూబే బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
202 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 9 పరుగుల వద్దే తొలి వికెట్‌ కోల్పోయింది. ఉనద్కత్‌ బౌలింగ్‌లో క్లాసెన్‌ అద్భుతమైన రన్నింగ్‌ క్యాచ్‌ పట్టడంతో ఫిల్‌ సాల్ట్‌ (8) ఔటయ్యాడు. అయితే సాల్ట్‌ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన పడిక్కల్‌ (11 బంతుల్లో 34 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి బంతి నుంచే ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించాడు. అతనికి జతగా విరాట్‌ కోహ్లి (17 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నాడు. 4.3 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 61-1గా ఉంది.

ఆర్సీబీ టార్గెట్‌ ఎంతంటే..?
వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినా ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ స్కోర్‌ చేసింది. ఇషాన్‌ కిషన్‌ (80) విధ్వంసం.. క్లాసెన్‌ క్లాస్‌ (31), ఆఖర్లో అనికేత్‌ వర్మ (43) మెరుపుల కారణంగా ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. 

హెడ్‌ 11, అభిషేక్‌ 7, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 1, సలీల్‌ అరోరా 9, హర్ష్‌ దూబే 3, హర్షల్‌ పటేల్‌ డకౌట్‌ కాగా.. డేవిడ్‌ పేన్‌ 6, ఉనద్కత్‌ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో డఫీ, రొమారియో షెపర్డ్‌ చెరో 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్‌ కుమార్‌, అభినందన్‌ సింగ్‌, సుయాశ్‌ శర్మ తలో వికెట్‌ తీశారు. 

ఇషాన్‌ కిషన్‌ ఔట్‌
15.6వ ఓవర్‌- 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఇషాన్‌ కిషన్‌ ఔటయ్యాడు. అభినందన్‌ సింగ్‌ బౌలింగ్‌లో సాల్ట్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. 16 ఓవర్ల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌ 155-6గా ఉంది. 

ఐదో వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
14.3వ ఓవర్‌- 137 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. సుయాశ్‌ శర్మ బౌలింగ్‌లో పడిక్కల్‌కు క్యాచ్‌ ఇచ్చి సలీల్‌ అరోరా (9) ఔటయ్యాడు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌
13.1వ ఓవర్‌లో సన్‌రైజర్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. అద్భుతంగా ఆడుతున్న హెన్రిచ్‌ క్లాసెన్‌ (31) రొమారియో షెపర్డ్‌ బౌలింగ్‌లో ఫిల్‌ సాల్ట్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. ఇషాన్‌ కిషన్‌కు (72) జతగా సలీల్‌ అరోరా క్రీజ్‌లోకి వచ్చాడు. 

29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
ఎస్‌ఆర్‌హెచ్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. డఫీ ఎస్‌ఆర్‌హెచ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. 3వ ఓవర్‌లో ఓపెనర్లు అభిషేక్‌, హెడ్‌ వికెట్లు తీసిన ఇతను.. ఐదో ఓవర్‌ తొలి బంతికే నితీశ్‌కుమార్‌ రెడ్డిని (1) పెవిలియన్‌కు పంపాడు. 

హెడ్‌ ఔట్‌.. 23 పరుగులకే ఓపెనర్లు డౌన్‌
23 పరుగులకే (3 ఓవర్లు) ఎస్‌ఆర్‌హెచ్‌ ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. డేంజరెస్‌ బ్యాటర్‌ ట్రవిస్‌ హెడ్‌ (11) డఫీ బౌలింగ్‌లో సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 

అభిషేక్‌ ఔట్‌.. తొలి వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌  
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌  18 పరుగుల వద్ద (2.1వ ఓ‍వర్‌) తొలి వికెట్‌ కోల్పోయింది. విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (7) జేకబ్‌ డఫీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్సీబీ, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య ఇవాల్టి (మార్చి 28) మ్యాచ్‌తో ఐపీఎల్‌ 2026 ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.

తుది జట్లు..
ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్‌కీపర్‌), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ

సన్‌రైజర్స్‌: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement