Ravi Shastri:'కొన్ని శక్తులు నాశనం చేయాలనుకున్నాయి.. దృఢంగా నిలబడ్డా'

Ravi Shastri Says Jealous Gang Wanted-me To Fail When I-Was Head Coach - Sakshi

టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నప్పుడు కొన్ని తెలియని శక్తులు గ్యాంగ్‌గా ఏర్పడి నన్ను నాశనం చేయాలని చూశారు.. నా మనోబలం గొప్పది. విమర్శలు తట్టుకునే శక్తి కలది'' అని పేర్కొన్నాడు. ది గార్డియన్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు.  

‘'నా దగ్గర కోచింగ్ బ్యాడ్జీలు లేవు... లెవెన్ 1? లెవన్ 2? అలా ఏ బ్యాడ్జీలు లేవు. మన దేశంలో ఒకడు ఎదుగుతున్నాడంటే కొంతమంది దాన్ని చూసి తట్టుకోలేరు... మనం ఓడిపోవాలని కోరుకుంటుంటారు. నా విషయంలో అదే జరిగింది. నేను హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మేం ఓడిపోవాలని చాలామంది కోరుకున్నారు.

అయితే నా సంకల్పం చాలా దృఢమైనది. డ్యూక్ బాల్స్‌కి వాడే తోలు కంటే నా చర్మం బలంగా ఉంటుంది. అంత తేలిగ్గా నేను ఎవరికి లొంగను. ఓటమిని అంగీకరించడానికి ఇష్టపడను. ఇక్కడ మనం ఏం చేసినా, దాన్ని విమర్శించడానికి, తప్పులు వెతకడానికి చాలామంది ఖాళీగా ఉంటారు.

దేశవాళీ క్రికెట్‌లో ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్ విషయానికి వస్తే పని కంటే మాటలు పడుతూ, చాలామందికి ఏం చేస్తున్నామో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే ప్లేయర్లను అర్థం చేసుకుని, వారిని ముందుగా మనం నమ్మి, వారిపై వారికి నమ్మకం కలిగిస్తే చాలు.. విజయాలు వాటంతట అవే వస్తాయి. టీమ్ కల్చర్ పాడుకాకుండా చూసుకుంటే సరిపోతుంది. 

ఆస్ట్రేలియాలో కమ్మిన్స్, స్టార్క్, హజల్‌వుడ్ వంటి పేస్ అటాకింగ్‌ని తట్టుకుని, అది కూడా 1-0 తేడాతో వెనకబడిన తర్వాత సిరీస్ గెలుస్తామని ఎవరైనా ఊహించి ఉంటారా... కానీ మేం చేసి చూపించాం..ఇంగ్లండ్‌లోనూ అంతే. ఇలాంటి విజయాలు ఏ జట్టుకైనా అంత తేలిగ్గా దొరకవు. ఇండియా సాధించిన విజయాలను రిపీట్ చేయడానికి చాలా టైం పడుతుంది’' అంటూ పేర్కొన్నాడు.

కాగా 2017 నుంచి 2021 వరకు రవిశాస్త్రి టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేశాడు. కోచ్‌గా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయినా విదేశాల్లో అసాధ్యమైన విజయాలు సాధించాడు రవిశాస్త్రి. కోహ్లీతో పాటు రహానే, రోహిత్ శర్మ కెప్టెన్సీలో.. రవిశాస్త్రి కోచింగ్‌లో టీమిండియా అద్భుత విజయాలు అందుకుంది. ఆస్ట్రేలియాలో ఆడిలైడ్ టెస్టులో ఘోర పరాభవం తర్వాత ఊహించని రీతిలో ఫుంజుకున్న టీమిండియా 1-2 తేడాతో టెస్టు సిరీస్ కైవసం చేసుకుని ఔరా అనిపించింది. రవిశాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలోనే ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాల్లోనూ అద్భుత విజయాలు సాధించింది.

చదవండి: Max Verstappen: 'స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ది ఇయర్‌'గా ఫార్ములావన్‌ ప్రపంచ చాంపియన్‌

బుడగ లేకుండానే భారత్‌-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top