సౌతాఫ్రికాకు భారీ షాక్‌.. రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన స్టార్ ప్లేయ‌ర్‌ | Rassie van der Dussen retires from international cricket | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికాకు భారీ షాక్‌.. రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన స్టార్ ప్లేయ‌ర్‌

Apr 2 2026 2:15 PM | Updated on Apr 2 2026 4:27 PM

Rassie van der Dussen retires from international cricket

దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. 37 ఏళ్ల వాన్‌డెర్ డ‌స్సెన్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. అయితే డొమాస్టిక్ క్రికెట్‌లో మాత్రం 'లయన్స్' జట్టు తరపున మాత్రం ఆడడం కొనసాగిస్తానని అతడు స్పష్టం చేశాడు.

"దక్షిణాఫ్రికా క్రికెట్‌కు అ‍త్యున్నత స్దాయిలో ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. ప్రోటీస్ జెర్సీ ధరించిన ప్రతీసారి ఒక ప్రత్యేక అనుభూతి కలుగుతోంది. అయితే ఈ రోజు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. అయితే ప్రోటీస్ క్రికెట్‌కు నా సేవలను అందించేందుకు నేను ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటాను.

నా ఈ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన సౌతాఫ్రికా క్రికెట్‌కు, నా సహచరులకు, అభిమానులందరికి ధన్యవాదాలు" అని వాన్‌డెర్ డ‌స్సెన్ పేర్కొన్నాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన డస్సెన్‌.. సౌతాఫ్రికాకు 71 వన్డేలు, 18 టెస్టులు, 57 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. ముఖ్యంగా వన్డేల్లో ప్రోటీస్‌కు కీలక ఆటగాడిగా అతడు ఉన్నాడు.

అతడి పేరిట 6 వన్డే సెంచరీలు ఉన్నాయి. 2023, 2019 ప్రపంచకప్‌లలో సౌతాఫ్రికా తరపున అతడు ఆడాడు. ఐపీఎల్‌లో కూడా అతడు రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో 4968 పరుగులు చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement