
మేజర్ లీగ్ క్రికెట్-2025లో టెక్సాస్ సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ టోర్నీలో భాగంగా గురువారం వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో సూపర్ కింగ్స్ విజయభేరి మ్రోగించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 87 పరుగుల భారీ స్కోర్ చేసింది.
సూపర్ కింగ్స్ ఓపెనర్లు స్టోయినిష్(2), డార్లీ మిచెల్(6 రిటైర్డ్ హార్ట్) నిరాశపరిచినప్పటికి.. శుభమ్ రంజనే( 14 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 నాటౌట్), డోనోవన్ ఫెరీరా(9 బంతుల్లో 5 సిక్స్‌లతో 37 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.
సౌతాఫ్రికాకు చెందిన ఫెరీరా.. ఆఖరి ఓవర్ వేసిన మిచెల్ ఓవెన్ బౌలింగ్‌లో నాలుగు సిక్సర్లు, రెండు డబుల్స్ సాయంతో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. అతడి విధ్వంసకర బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా వాషింగ్టన్ బౌలర్లలో నేట్రావల్కర్ ఓ వికెట్ సాధించాడు.
అనంతరం 88 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిదిగిన వాషింగ్టన్ జట్టు నిర్ణీత 5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 44 పరుగులకే పరిమితమైంది. వాషింగ్టన్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(18) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ మాక్స్‌వెల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో బర్గర్ రెండు, అకిల్ హోసేన్, నూర్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు. కాగా టెక్సాస్, వాషింగ్టన్ రెండు జట్లు ఇప్పటికే తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకున్నాయి.
DONOVAN FERREIRA - THE SUPERSTAR OF TEXAS SUPER KINGS.!!!
- 6, 6, 6, 2, 2, 6 vs Mitchell Owen in the final over to finish 37* (9) .!!!
pic.twitter.com/hbmUUZAWwC— MANU. (@IMManu_18) July 3, 2025