రజిత్‌ పాటిదార్‌ విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 4 సిక్స్‌లు! వీడియో వైర‌ల్‌ | Rajat Patidar Goes Crazy With Four Consecutive Sixes Against Markande | Sakshi
Sakshi News home page

IPL 2024: రజిత్‌ పాటిదార్‌ విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 4 సిక్స్‌లు! వీడియో వైర‌ల్‌

Apr 26 2024 12:03 AM | Updated on Apr 26 2024 12:03 AM

Rajat Patidar Goes Crazy With Four Consecutive Sixes Against  Markande

ఐపీఎల్‌-2024లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మిడిలార్డర్‌ బ్యాటర్‌ రజిత్‌ పాటిదార్ మరో అద్బుత ఇన్నింగ్స్‌ను ఆడాడు.  ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఉప్ప‌ల్‌ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో మ్యాచ్‌లో పాటిదార్ అద‌రగొట్టాడు. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. విల్ జాక్స్ ఔట‌య్యాక క్రీజులోకి వచ్చిన పాటిదార్‌.. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు.

ముఖ్యంగా స్పిన్న‌ర్ల‌ను టార్గెట్ చేశాడు. స్పిన్న‌ర్ మార్కండే వేసిన 11 ఓవ‌ర్‌లో పాటిదార్ వ‌రుసుగా 4 సిక్స్‌లు బాదాడు. ఈ క్ర‌మంలో కేవ‌లం 19 బంతుల్లోనే పాటిదార్ త‌న హాప్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. త‌ద్వారా ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ చేసిన రెండో ఆట‌గాడిగా రాబిన్ ఉత‌ప్ప స‌ర‌స‌న ర‌జిత్ నిలిచాడు. ఓవ‌రాల్‌గా ఈ మ్యాచ్‌లో 20 బంతులు ఎదుర్కొన్న పాటిదార్ 2 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 50 ప‌రుగులు చేశాడు.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్‌ పాటిదార్‌(50)తో పాటు విరాట్‌ కోహ్లి(51) హాఫ్‌ సెంచరీలతో చెలరేగాడు. అతడితో పాటు కామెరాన్ గ్రీన్(37 నాటౌట్‌) రాణించాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో జయ్‌దేవ్‌ ఉనద్కట్‌ 3 వికెట్లు పడగొట్టగా.. నటరాజన్‌ రెండు వికెట్లు, ప్యాట్‌ కమ్మిన్స్‌,మార్కండే తలా వికెట్‌ సాధించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement