‘హ్యాట్రిక్‌’పై రాజస్తాన్‌ గురి | Rajasthan Royals will face Mumbai Indians today | Sakshi
Sakshi News home page

‘హ్యాట్రిక్‌’పై రాజస్తాన్‌ గురి

Apr 7 2026 4:20 AM | Updated on Apr 7 2026 4:20 AM

Rajasthan Royals will face Mumbai Indians today

నేడు ముంబై ఇండియన్స్‌తో పోరు 

రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్,జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

గువాహటి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 19వ సీజన్‌లో మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన మాజీ చాంపియన్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ ‘హ్యాట్రిక్‌’ విజయంపై గురి పెట్టింది. నేడు జరిగే పోరులో ఐదుసార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో రియాన్‌ పరాగ్‌ బృందం తలపడనుంది. గత మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై చివరి వరకు పోరాడి గెలిచిన రాయల్స్‌... అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో పటిష్టంగా కనిపిస్తోంది. 

15 ఏళ్ల ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్‌ జురేల్, కెపె్టన్‌ రియాన్‌ పరాగ్, హెట్‌మైర్, రవీంద్ర జడేజాతో రాయల్స్‌ బ్యాటింగ్‌ బలంగా ఉంది. బౌలింగ్‌లో ఆర్చర్, సందీప్‌ శర్మ, తుషార్‌ దేశ్‌పాండే, జడేజా, రవి బిష్ణోయ్‌ కీలకం కానున్నారు. మరోవైపు సీజన్‌ను విజయంతో ఆరంభించిన ముంబై ఇండియన్స్‌ గత మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో పరాజయం పాలైంది. ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ మంచి టచ్‌లో ఉండగా... తిలక్‌ వర్మ, రూథర్‌ఫోర్డ్, నమన్‌ ధీర్‌ రాణించాల్సిన అవసరముంది. 

అస్వస్థతతో గత మ్యాచ్‌కు దూరమైన కెపె్టన్‌ హార్దిక్‌ పాండ్యా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడా చూడాలి. జస్‌ప్రీత్‌ బుమ్రా, దీపక్‌ చహర్, శార్దుల్‌ ఠాకూర్, కార్బిన్‌ బాష్, మయాంక్‌ మార్కండే బౌలింగ్‌ భారం మోయనున్నారు. ఐపీఎల్‌లో ముంబై, రాజస్తాన్‌ జట్ల మధ్య 31 మ్యాచ్‌లు జరిగాయి. 16 మ్యాచ్‌ల్లో ముంబై, 14 మ్యాచ్‌ల్లో రాజస్తాన్‌ గెలిచాయి. ఒక మ్యాచ్‌ రద్దయింది. రాజస్తాన్‌పై ముంబై అత్యధిక స్కోరు 214 పరుగులుకాగా, అత్యల్ప స్కోరు 92. ముంబై ఇండియన్స్‌పై రాజస్తాన్‌ రాయల్స్‌ అత్యధిక స్కోరు 212 పరుగులుకాగా, అత్యల్ప స్కోరు 90 పరుగులుగా ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement