‘ఇదే నా హెచ్చరిక.. ఈసారి గట్టిగా కొట్టబోతున్నాం’ | Rajasthan Captain Riyan Parag Comments After Match Won Vs Gujarat Titans | Sakshi
Sakshi News home page

Riyan Parag: ‘ఇదే నా హెచ్చరిక.. ఈసారి గట్టిగా కొట్టబోతున్నాం’

Apr 5 2026 3:10 PM | Updated on Apr 5 2026 4:51 PM

Rajasthan Captain Riyan Parag Comments After Match Won Vs Gujarat Titans

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్తార్ రాయల్స్ రెండు వరుస విజయాలతో జోష్ మీద ఉంది. రియాన్ పరాగ్ నేతృత్వంలోని జట్టులో యువరక్తం ఎక్కువగా కనిపిస్తోంది. తాజగా శనివారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 6 పరుగుల తేడాతో ఉ‍త్కంఠ విజయాన్ని అందుకుంది. కాగా మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడాడు. 

'ఈ విజయం అద్భుతంగా అనిపించింది. ఒక దశలో నేను రిస్క్ తీసుకుందామని భావించాను. మా ఆటగాళ్లు మేమనుకున్న ప్లాన్‌ను సక్రమంగా అమలు చేశారు. నా గొంతు కూడా మారిపోయేంతగా నేను అరిచాను. ప్లేయర్స్ నేను అనుకున్న విధంగా ఆడినందుకు సంతోషంగా అనిపించింది. 

19వ, 20వ ఓవర్లు ఎవరు బౌలింగ్ చేయాలన్న విషయంలో నేను కాస్త అయోమయంలో ఉన్నా.  ఆ సమయంలో 12 బంతుల్లో 15 పరుగులు అవసరమయ్యాయి. దూకుడుగా బౌలింగ్ చేయాలనుకున్నాను. అది సక్సెస్ అయితే బాగుంటుంది, లేదంటే తర్వాత మళ్లీ ప్రయత్నిస్తాం అనుకున్నా. అయితే ధృవ్ జురెల్ వచ్చి అంతా సెట్ చేశాడు. 

19వ ఓవర్‌ను ఆర్చర్‌కు ఇవ్వాలని సూచించాడు. అది సక్సెస్ అయింది. ధ్రువ్‌జురెల్ ప్రతిభకు ఇప్పటివరకు పూర్తిగా న్యాయం జరగలేదని నాకు అనిపిస్తుంది. అతను 6వ, 7వ స్థానాల్లో బ్యాటింగ్ చేస్తూ కష్టమైన పాత్ర పోషించాడు. కానీ ఈసారి మూడో స్థానంలో అవకాశం ఇచ్చినప్పుడు తన సత్తా నిరూపించుకున్నాడు. 

జురెల్ 700-800 పరుగులు చేసి జట్టుకు టైటిల్ అందించాలని ఆశిస్తున్నాను. వరుసగా రెండు మ్యాచ్లు గెలవడం ఆనందంగా ఉంది. ఈ విజయంలో పూర్తి క్రెడిట్ బౌలర్లకే చెందుతుంది. ముంబైపై ఎలా ఆడాలనే దానిపై దృష్టి సారిస్తాం. ఈసారి గట్టిగా కొడతాం' అని పరాగ్ ధీమా వ్యక్తం చేశాడు.

చదవండి: సీఎస్‌కే అంటే కోహ్లీకి పూన‌క‌మే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement