డాక్టర్‌ పుల్లెల గోపీచంద్‌! | Pullela Gopichand awarded honorary doctorate | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ పుల్లెల గోపీచంద్‌!

Jul 5 2023 5:41 AM | Updated on Jul 5 2023 5:41 AM

Pullela Gopichand awarded honorary doctorate - Sakshi

బెంగళూరు: భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌కు మరో గౌరవం దక్కింది. కర్ణాటకకు చెందిన శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్‌ హ్యూమన్‌ ఎక్సలెన్స్‌ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది.

మంగళవారం జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆయనకు ఈ పురస్కారాన్ని అందించారు. జాతీయ అభివృద్ధిలో క్రీడల ద్వారా తనదైన పాత్ర పోషించినందుకు గోపీచంద్‌ను డాక్టరేట్‌ కోసం ఎంపిక చేసినట్లు యూనివర్సిటీ ప్రకటించింది. గోపీచంద్‌తో పాటు మరో నలుగురు కూడా దీనిని అందుకున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement