రసెల్‌కు ‘పోల్‌ పొజిషన్‌’ | Pole position for Russell | Sakshi
Sakshi News home page

రసెల్‌కు ‘పోల్‌ పొజిషన్‌’

Jun 10 2024 4:09 AM | Updated on Jun 10 2024 4:09 AM

Pole position for Russell

మాంట్రియల్‌: మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ జార్జి రసెల్‌ తన కెరీర్‌లో రెండోసారి ‘పోల్‌ పొజిషన్‌’ సాధించాడు. ఫార్ములావన్‌ సీజన్‌లో భాగంగా తొమ్మిదో రేసు కెనడా గ్రాండ్‌ప్రిని రసెల్‌ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. క్వాలిఫయింగ్‌ సెషన్‌లో రసెల్, రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ అందరికంటే వేగంగా ఒక నిమిషం 12 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశారు.

 అయితే వెర్‌స్టాపెన్‌కంటే ముందుగా రసెల్‌ ఈ సమయాన్ని నమోదు చేయడంతో అతనికి పోల్‌ పొజిషన్‌ కేటాయించారు. మూడు క్వాలిఫయింగ్‌ సెషన్‌లు కలిపి రసెల్‌ 26 ల్యాప్‌లు... వెర్‌స్టాపెన్‌ 27 ల్యాప్‌లు పూర్తి చేశారు. 2022లో హంగేరి గ్రాండ్‌ప్రిలో తొలిసారి రసెల్‌ ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించాడు. 

ఆ తర్వాత రసెల్‌కు మళ్లీ పోల్‌ పొజిషన్‌ దక్కలేదు. లాండో నోరిస్‌ (మెక్‌లారెన్‌) మూడో స్థానం నుంచి... ఆస్కార్‌ పియాస్ట్రి (మెక్‌లారెన్‌) నాలుగో స్థానం నుంచి... డానియల్‌ రికార్డో (హోండా) ఐదో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఎనిమిది రేసులు జరగ్గా... తొలి ఏడు రేసుల్లో వెర్‌స్టాపెన్, ఎనిమిదో రేసులో చార్లెస్‌ లెక్‌లెర్క్‌ పోల్‌ పొజిషన్‌లు సాధించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement