ప్యాట్‌ కమ్మిన్స్‌ కీలక ప్రకటన | Pat Cummins Releases Official Statement On His IPL 2026 Availability For SRH | Sakshi
Sakshi News home page

IPL 2026: ప్యాట్‌ కమ్మిన్స్‌ కీలక ప్రకటన

Mar 26 2026 12:40 PM | Updated on Mar 26 2026 12:49 PM

Pat Cummins Releases Official Statement On His IPL 2026 Availability For SRH

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌మ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మైంది. మార్చి 28న చిన్న‌స్వామి స్టేడియంలో జ‌ర‌గ‌నున్న ఆరంభ మ్యాచ్‌లో  రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఆరెంజ్ ఆర్మీ ఢీకొట్ట‌నుంది.

అయితే ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ రెగ్యూల‌ర్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ లేకుండానే బ‌రిలోకి దిగ‌నుంది. క‌మ్మిన్స్ ప్ర‌స్తుతం వెన్ను నొప్పితో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో అత‌డు జ‌ట్టుతో చేర‌న‌ప్ప‌టికి అత‌డు బెంచ్‌కే ప‌రిమితం కానున్నాడు. ఈ క్ర‌మంలో ఆరంభ మ్యాచ్‌ల‌కు ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టు కెప్టెన్‌గా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్ వ్యవ‌హ‌రించ‌నున్నాడు. అయితే తాజాగా ప్యాట్ క‌మ్మిన్స్ త‌న రిక‌వ‌రీపై అప్‌డేట్ ఇచ్చాడు.

"వెన్ను గాయం నుంచి కోలుకుంటున్నాను. పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు అతి చేరువలో ఉన్నాను. ఇప్పటికే నెట్స్‌లో బౌలింగ్ చేయడం కూడా ప్రారంభించాను. ఐపీఎల్ మరో రెండు రోజుల్లో మొదలు కానుంది. అయితే ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు.

కానీ మరి కొన్ని రోజుల్లో తిరిగి మైదానంలో అడుగుపెట్టడం ఖాయమని" కమ్మిన్స్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా క‌మ్మిన్స్ దూర‌మైన‌ప్ప‌టికి డేవిడ్ పేయిన్‌, ఎషాన్ మ‌లింగ వంటి స్పీడ్ స్టార్లు ఉన్నారు.

ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టు
బ్యాటర్లు: ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ, స్మరన్ రవిచంద్రన్, సలీల్ అరోరా, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్

ఆల్ రౌండర్లు: హర్షల్ పటేల్, కమిందు మెండిస్, హర్ష్ దూబే, బ్రైడన్ కార్సే, శివంగ్ కుమార్, క్రెయిన్ ఫులేట్రా, లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి

బౌలర్లు: పాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలే, అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, శివమ్ మావి
చదవండి: IPL 2026: ట్రక్ డ్రైవర్ కొడుకు నుంచి ఆర్సీబీ క్రికెటర్‌గా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement