ఒలింపిక్స్‌లో రెండో రోజు (జులై 28) భారత్‌కు అనుకూల ఫలితాలు | Paris Olympics 2024: India Gets Positive Victories On Day 2 | Sakshi
Sakshi News home page

ఒలింపిక్స్‌లో రెండో రోజు (జులై 28) భారత్‌కు అనుకూల ఫలితాలు

Jul 29 2024 7:03 AM | Updated on Jul 29 2024 8:46 AM

Paris Olympics 2024: India Gets Positive Victories On Day 2

పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండో రోజు (జులై 28) భారత్‌కు అనుకూల ఫలితాలు వచ్చాయి. షూటింగ్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో మనూ భాకర్‌ భారత్‌కు తొలి పతకం (కాంస్యం) అందించగా.. మహిళల 10 మీటర్ల ఎయిర్‌  రైఫిల్‌ విభాగంలో రమిత జిందాల్‌, పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో అర్జున్‌ బబుతా ఫైనల్స్‌కు అర్హత సాధించారు. అలాగే పురుషుల రోయింగ్‌ సింగిల్స్‌ స్కల్స్‌ రెపిచేజ్‌ రౌండ్‌లో బల్‌రాజ్‌ పన్వర్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు.

మహిళల 50 కేజీల బాక్సింగ్‌ పోటీల్లో తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ ప్రీ క్వార్టర్స్‌కు చేరింది.

మహిళల టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఆకుల శ్రీజ, మనికా బత్రా విజయం సాధించారు.

పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ తొలి రౌండ్‌లో హెచ్‌ ఎస్‌ ప్రణయ్‌ విజయం సాధించాడు. 

రెండో రోజు భారత్‌కు వచ్చిన వ్యతిరేక ఫలితాలు..

పురుషుల టేబుల్‌ టెన్నిస్‌ తొలి రౌండ్‌లో శరత్‌ కమల్‌ స్లొవేనియాకు చెందిన డేనీ కొజుల్‌ చేతిలో 2-4 తేడాతో (12-10 9-11 6-11 7-11 11-8 10-12) ఓటమిపాలయ్యాడు.

పురుషుల టెన్నిస్‌ సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సుమిత్‌ నగాల్‌ ఫ్రాన్స్‌కు చెందిన కొరెంటిన్‌ మౌటెట్‌ చేతిలో 2-6, 6-2, 5-7 తేడాతో ఓటమిపాలయ్యాడు.

భారత మహిళల ఆర్చరీ టీమ్‌ (అంకిత భకత్‌, భజన్‌ కౌర్‌, దీపికా కుమార్‌) క్వార్టర్‌ ఫైనల్లో నెదర్లాండ్స్‌ చేతిలో 0-6 తేడాతో భారత్‌ ఓటమిపాలైంది.

టేబుల్‌ టెన్నిస్‌లో హర్మీత్‌ దేశాయ్‌, స్విమ్మింగ్‌లో శ్రీహరి నటరాజ్‌, ధినిధి దేశింగు ఓటమిపాలయ్యారు. 
 


 

Advertisement
 
Advertisement
Advertisement