Pakistan Skipper Babar Azam Honey Trapped, Pictures And Videos Leaked - Sakshi
Sakshi News home page

Babar Azam: పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ న్యూడ్‌ వీడియో కాల్స్‌.. సహచరుడి గర్ల్‌ ఫ్రెండ్‌తో..?

Jan 16 2023 6:53 PM | Updated on Jan 16 2023 7:33 PM

Pakistan Skipper Babar Azam Honey Trapped, Pictures And Videos Leaked - Sakshi

Babar Azam Nude Video Calls: పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ సెన్సేషనల్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో బాబర్‌.. తన సహచరుడి (పాక్‌ జట్టులో సభ్యుడు) గర్ల్‌ ఫ్రెండ్‌తో అసభ్య పదజాలం ఉపయోగించి చాటింగ్‌ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇందులో ఉన్నది బాబరా లేక ఎవరైనా మార్ఫింగ్‌ చేసి వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారా అన్న విషయం తెలియాల్సి ఉంది.

నియో యాదవ్‌ అనే ఓ నెటిజన్‌ పోస్ట్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం క్రికెట్‌ సర్కిల్స్‌లో, ముఖ్యంగా పాక్‌ క్రికెట్‌ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇందులో ఉన్నది పాక్‌ కెప్టెన్‌ కాదు, మార్ఫింగ్‌ చేశారని కొందరంటుంటే, మరికొందరేమో ఇది ముమ్మాటికి పాకిస్తాన్‌ కెప్టెన్‌ వీడియోనేనని సోషల్‌మీడియాలో వాదనలకు దిగుతున్నారు.

బాబర్‌ న్యూడ్‌ వీడియోను పోస్ట్‌ చేసిన నెటిజన్‌ కధనం ప్రకారం.. ఇందులో బాబర్‌, తన సహచర పాకిస్తాన్‌ ఆటగాడి గర్ల్‌ ఫ్రెండ్‌తో సెక్స్‌ చాటింగ్‌ చేస్తున్నాడు. తనతో చాటింగ్‌ కొనసాగిస్తే.. సదరు అమ్మాయి ప్రియుడికి జట్టులో స్థానానికి ఢోకా ఉండదని ప్రామిస్‌ చేశాడు. ఈ వీడియోతో పాటు పలు అసభ్య చాట్‌ మెసేజ్‌లు, ఆడియో రికార్డింగ్‌లు, బాబర్‌కు సంబంధించిన పర్సనల్‌ ఫోటోలు కూడా సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. 

ఇప్పటికే స్వదేశంలో వరుస సిరీస్‌ల్లో జట్టును గెలిపించలేక, కెప్టెన్సీ కోల్పోయే ప్రమాదం‍లో ఉన్న బాబర్‌కు తాజా ఉదంతం మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టనుంది. ఈ ఉదంతంపై బాబర్‌ ఆజమ్‌ కానీ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement