చారిత్రక ద్వైపాక్షిక సిరీస్‌ను ప్రకటించిన పాకిస్తాన్‌ | Pakistan Announces Historic Bilateral Series For The 1st Time vs This Team | Sakshi
Sakshi News home page

చారిత్రక ద్వైపాక్షిక సిరీస్‌ను ప్రకటించిన పాకిస్తాన్‌

Apr 10 2026 1:17 PM | Updated on Apr 10 2026 2:21 PM

Pakistan Announces Historic Bilateral Series For The 1st Time vs This Team

పాకిస్తాన్‌ క్రికెట్‌ చరిత్రలో తొలిసారిగా మహిళల ద్వైపాక్షిక సిరీస్‌ జరగనుంది. జింబాబ్వే మహిళల జట్టు 3 మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం పాకిస్తాన్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌ మహిళల క్రికెట్‌ అభివృద్ధిలో కీలక ఘట్టంగా నిలవనుంది.  

ఈ సిరీస్‌లు మే 3 నుంచి 15 మధ్య తేదీల్లో జరుగనున్నాయి. వన్డే సిరీస్‌ ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌ 2025-29లో భాగంగా జరుగనుండగా.. టీ20 సిరీస్‌ సాధారణంగా సిరీస్‌గా పరిగణించబడుతుంది. అన్ని (వన్డే, టీ20) మ్యాచ్‌లు కరాచీ నేషనల్‌ బ్యాంక్‌ స్టేడియంలో జరగనున్నాయి.

షెడ్యూల్‌..
 - మే 3 – తొలి వన్డే  
 - మే 6 – రెండో వన్డే
 - మే 9 – మూడో వన్డే  
 - మే 12 – తొలి టీ20 
 - మే 14 – రెండో టీ20
 - మే 15 – మూడో టీ20  

జింబాబ్వే తొలిసారి ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటోంది. ఈ సిరీస్‌ మహిళల ఛాంపియన్‌షిప్‌లో భాగం కావడంతో 2029 వరల్డ్‌కప్‌ అర్హతపై ప్రభావం చూపుతుంది. మహిళల ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్‌ 8, జింబాబ్వే 11వ స్థానంలో ఉన్నాయి.

పాకిస్తాన్‌ ఇటీవల దక్షిణాఫ్రికా చేతిలో సిరీస్‌ కోల్పోయి ఎనిమిదో స్థానానికి పడిపోయింది. జింబాబ్వే ఇటీవల న్యూజిలాండ్‌ చేతిలో అన్ని మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, అట్టడుగు స్థానాన్ని ఆక్రమించుకుంది. ఇరు జట్లు ఈ సిరీస్‌లో పాయింట్లు సాధించి, ర్యాంకింగ్స్‌ మెరుగుపరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.  

జింబాబ్వే పరిమిత ఓవర్ల సిరీస్‌ల అనంతరం పాకిస్తాన్‌ ఐర్లాండ్‌ టీ20 ట్రై సిరీస్‌లో పాల్గొంటుంది. ఈ టోర్నీలో పాక్‌, ఐర్లాండ్‌తో పాటు వెస్టిండీస్‌ భాగం కానుంది. ఈ టోర్నీ మే 28 నుంచి ప్రారంభమవుతుంది.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌ 2025-29 పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌ అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, భారత్‌ జట్లు టాప్‌-5లో ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌, జింబాబ్వే ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement