
వన్డే వరల్డ్‌కప్ టోర్నీ క్వాలిఫైయర్ షెడ్యూల్ విడుదల (PC: ICC)
ICC World Cup 2023- దుబాయ్: వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ర్యాంకింగ్స్‌లో పడిపోయిన మాజీ చాంపియన్లు శ్రీలంక, వెస్టిండీస్ జట్లు ఈసారి క్వాలిఫయర్స్ ద్వారా ప్రధాన టోర్నీకి ముందడుగు వేయాల్సి ఉంటుంది. వచ్చేనెల 18 నుంచి జూలై 9 వరకు జింబాబ్వేలో క్వాలిఫయింగ్ టోర్నీ జరుగుతుంది. ప్రధాన టోర్నీకి కేవలం రెండు బెర్త్‌లే ఖాళీ ఉన్నాయి.
మొత్తం 10 జట్లు అర్హత టోర్నీలో పాల్గొంటాయి. గ్రూప్ ‘ఎ’లో వెస్టిండీస్, జింబాబ్వే, నెదర్లాండ్స్, నేపాల్, అమెరికా... గ్రూప్ ‘బి’లో శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్, యూఏఈ లీగ్ మ్యాచ్‌లు ఆడతాయి. ఫైనల్స్‌కు చేరే రెండు జట్లు అక్టోబర్–నవంబర్‌లలో భారత్ ఆతిథ్యమిచ్చే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధిస్తాయి.
ఇవి కూడా చదవండి: అంకిత రైనా శుభారంభం
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ అంకిత రైనా రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. పారిస్‌లో మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో అంకిత 7–5, 5–7, 6–2తోఎమిలైన్ డార్ట్‌రన్ (ఫ్రాన్స్)పై విజయం సాధించింది. 2 గంటల 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అంకిత తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 51 సార్లు దూసుకొచ్చి 29 సార్లు పాయింట్లు సాధించింది.
హారిక ఖాతాలో మరో ‘డ్రా’
మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది. సైప్రస్‌లో 12 మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య ఈ టోర్నీ జరుగుతోంది. రష్యాకు చెందిన అంతర్జాతీయ మాస్టర్ పొలీనా షువలోవాతో మంగళవారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను హారిక 25 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. రెండు గేముల్లో గెలిచి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హారిక ఏడో రౌండ్ తర్వాత 4.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది.