
జ్యూరిక్ డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ మీట్ ఫైనల్స్‌లో 85.01 మీటర్లు జావెలిన్ విసిరి రెండో స్థానంలో నిలిచిన భారత స్టార్ నీరజ్ చోప్రా తన ప్రదర్శనపై కొంత అసంతృప్తిని ప్రదర్శించాడు. పూర్తిగా వైఫల్యం అనకపోయినా, తాను మరింత మెరుగ్గా ఆడాల్సిందని అతను వ్యాఖ్యానించాడు.
‘జావెలిన్‌ను విసిరే సమయంలో నా రనప్ గానీ టైమింగ్ గానీ బాగా లేవు. సరైన లయను అందుకోలేకపోయాను. నా ప్రదర్శనతో కొన్ని సానుకూలతలు కనిపించినా మొత్తంగా చూస్తే మరింత మెరుగ్గా త్రో చేయాల్సింది. నాకు సంబంధించి ఇది కఠినమైన రోజుగా భావిస్తున్నా.
ఇలాంటి స్థితిలోనూ చివరి ప్రయత్నంలో 85 మీటర్లు విసరగలిగాను కానీ నాకు మరింత ప్రాక్టీస్ అవసరం. వరల్డ్ చాంపియన్‌షిప్‌కు మరో మూడు వారాల సమయం ఉంది. ఆలోగా లోపాలు సరిదిద్దుకొని నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తా’ అని నీరజ్ చెప్పాడు. టోక్యోలో జరిగే ఈ పోటీల్లో నీరజ్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్నాడు.
చదవండి: DPL 2025: నితీష్ విధ్వంసకర సెంచరీ.. 15 సిక్స్‌లతో వీర విహారం! వీడియో