
దుబాయ్ : మహేంద్రసింగ్ ధోనీ.. ఈ పేరు భారత క్రికెట్‌లో సరికొత్త కొత్త చరిత్ర. హెలికాప్టర్ షాట్ కొట్టినా.. జుట్టుపెంచినా.. జుట్టు కత్తిరించినా.. మైదానంలో కెప్టెన్‌గా ఎన్నో మ్యాచ్‌లు కూల్‌గా గెలిపించినా.. ఓడినా ఇలా ధోని ఏంచేసినా క్రికెట్ అభిమానుల్లో అవి చర్చనీయాంశంగా నిలిచాయి. అయితే తాజాగా.. సుదీర్ఘ కాలం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోనీ న్యూలుక్ ఇప్పుడు టాక్ ఆఫ్‌ది టౌన్‌గా మారింది. ఎంతోకాలం నుంచి మైదానంలో ధోనిని చూడాలనుకుంటున్న వారికి తన గడ్డం స్టయిల్‌ను కాస్త మార్చుకొని ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో అతను బరిలోకి దిగాడు.
ధోనీ ప్రస్తుతం సింగం స్టైల్లో కాస్త ట్రిమ్ చేసుకొని డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు. అయితే ధోని న్యూలుక్‌పై అతడి అభిమానులు సోషల్ మీడియాలో వివిధ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. 2019 ప్రపంచకప్ సెమీఫైనల్ న్యూజిలాండ్- టీమీండియా మ్యాచ్‌లో ధోని చివరిసారిగా కనిపించాడు. కాగా.. ఈ ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ('ధోని.. నిజంగా నువ్వు అద్భుతం')
Thala #Dhoni In singam Look 😍🔥#SooraraiPottru #ipl2020schedule pic.twitter.com/YmT0yloTbE
— Suriya Fans Members ™ (@SuriyaFCMembers) September 19, 2020