ITTF-ATTU Asian Cup: మనిక బాత్రా సంచలనం

బ్యాంకాక్: ఐటీటీఎఫ్–ఏటీటీయూ ఆసియాన్ కప్‌లో భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనిక బాత్రా సంచలన విజయంతో క్వార్టర్స్ చేరింది. ఈ క్రీడలో ‘పవర్ హౌజ్’ అయిన చైనాకు చెందిన ప్రపంచ ఏడో ర్యాంకర్ చెన్ జింగ్‌టాంగ్‌ను కంగు తినిపించింది.
గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 44వ ర్యాంకర్ మనిక 4–3 (8–11, 11–9, 11–6, 11–6, 9–11, 8–11, 11–9)తో తనకన్నా ఎన్నో రెట్లు మెరుగైన ర్యాంకింగ్ ప్లేయర్ జింగ్‌టాంగ్‌ను ఇంటిదారి పట్టించింది.
చదవండి: Indian Racing League: రెడీ టూ రైడ్.. ఇండియన్ రేసింగ్ లీగ్‌కు సర్వం సిద్దం
మరిన్ని వార్తలు