చరిత్రకు చేరువలో... | Madrid tennis Open: Jannik Sinner cruises past Fils to reach final, meets Alexander Zverev | Sakshi
Sakshi News home page

చరిత్రకు చేరువలో...

May 2 2026 12:24 PM | Updated on May 2 2026 12:24 PM

Madrid tennis Open: Jannik Sinner cruises past Fils to reach final, meets Alexander Zverev

మాడ్రిడ్‌: ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇటలీ టెన్నిస్‌ స్టార్, ప్రపంచ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ కొత్త చరిత్ర సృష్టించేందుకు విజయం దూరంలో నిలిచాడు. వరుసగా ఐదు మాస్టర్స్‌ సిరీస్‌–1000 టైటిల్స్‌ గెలిచిన తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పేందుకు సినెర్‌ సిద్ధమయ్యాడు.

 మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోరీ్నలో టాప్‌ సీడ్‌ సినెర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి సెమీఫైనల్లో సినెర్‌ 6–2, 6–4తో ఆర్థర్‌ ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)పై గెలుపొందాడు. సినెర్‌ కెరీర్‌లో ఇది 350వ విజయం కావడం విశేషం. 86 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో సినెర్‌ నాలుగు ఏస్‌లు సంధించి, ఒక డబుల్‌ ఫాల్ట్‌ చేశాడు. తొలి సరీ్వస్‌లో 21 పాయింట్లు, రెండో సర్వీస్‌లో 15 పాయింట్లు సాధించాడు. తన సరీ్వస్‌ను ఒక్కసారి కూడా కోల్పోని సినెర్‌ ప్రత్యర్థి సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేశాడు. అలెగ్జాండర్‌ బ్లాక్స్‌ (బెల్జియం), అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) మధ్య రెండో సెమీఫైనల్‌ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో సినెర్‌ తలపడతాడు. 

గత ఏడాది పారిస్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ టైటిల్‌ గెలిచిన సినెర్‌... ఈ ఏడాది ఇండియన్‌ వెల్స్, మయామి ఓపెన్, మోంటెకార్లో ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోరీ్నల్లోనూ విజేతగా నిలిచాడు. మాడ్రిడ్‌ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరడం ద్వారా... ఏటీపీ సర్క్యూట్‌లోని తొమ్మిది మాస్టర్స్‌ సిరీస్‌ టోరీ్నల్లో ఫైనల్‌ చేరిన నాలుగో ప్లేయర్‌గా, అతి పిన్న వయస్కుడిగా 24 ఏళ్ల సినెర్‌ గుర్తింపు పొందాడు. గతంలో రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా), రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) మాత్రమే ఈ ఘనత సాధించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement