Surya Kumar Yadav: 'కోహ్లి స్లెడ్జింగ్‌ వేరే లెవెల్‌.. తలదించుకొనే బ్యాటింగ్‌ కొనసాగించా'

Kohli's Sledging Was Another Level Suryakumar Reveal IPL 2020 Face-Off - Sakshi

ముంబై ఇండియన్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ టీమిండియా మెషిన్‌ గన్‌ విరాట్‌ కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి స్లెడ్జింగ్‌ వేరే లెవెల్లో ఉంటుందని.. మనం తట్టుకోవడం కష్టమంటూ పేర్కొన్నాడు. గౌరవ్‌ కపూర్‌ నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ చాంపియన్స్‌ యూట్యూబ్‌ షోలో సూర్యకుమార్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌ 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌, ఆర్సీబీ మధ్య కీలకమైన ప్లేఆఫ్‌ మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో కోహ్లితో జరిగిన అనుభవాన్ని సూర్య ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు.

''165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగాం. అయితే రెండు వికెట్లు కోల్పోవడంతో మా చేజింగ్‌ కాస్త స్లోగా సాగుతుంది. ఎలాగైనా మ్యాచ్‌ గెలవాలనే పట్టుదలతో ఎవరు ఏం చేసినా నా బ్యాటింగ్‌ ఫోకస్‌ను కోల్పోకూడదని భావించాను. కానీ అప్పటి ఆర్‌సీబీ కెప్టెన్‌ కోహ్లి రూపంలో నాకు ఎదురుగా కనిపించాడు. గ్రౌండ్‌లో ఉంటే కోహ్లి ఎనర్జీ లెవెల్స్‌ వేరుగా ఉంటాయి. అతను పొరపాటు స్లెడ్జింగ్‌కు దిగాడో తట్టుకోవడం కష్టం. ఒక రకంగా కోహ్లికి ఎనర్జీ లాంటిది. తన చర్యలతో ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్లను కన్ఫూజ్‌ చేస్తాడు. అతని మాయలో పడకూడదని గట్టిగా ఫిక్స్‌ అయ్యా.

పైగా ఇరుజట్లకు అది కీలక మ్యాచ్‌. ఓడిన జట్టు ఇంటికి.. గెలిచిన జట్టు ఫైనల్‌కు. ఈ పరిస్థితుల్లో కోహ్లి కళ్లలో పడకూడదనే ఉద్దేశంతో బ్యాటింగ్‌ కొనసాగించా. కోహ్లి నాకు ఎదురుగా ఉన్నప్పుడు తలదించుకొని బ్యాటింగ్‌ చేశా. దీనివల్ల నా ఫోకస్‌ దెబ్బతినలేదు. నేను బ్యాటింగ్‌ చేస్తున్నంత సేపు కోహ్లిని నేను ఏమి అనలేదు.. నన్ను కోహ్లి ఎలాంటి స్లెడ్జ్‌ చేయలేదు. మ్యాచ్‌ విజయానికి చేరువవుతున్న తరుణంలో మనుసులో ఈ విధంగా అనుకున్నా.'' ఇంతవరకు అంతా సక్రమంగానే జరిగింది. ఇంకో 10 సెకన్లు ఓపిక పడితే మ్యాచ్‌ గెలుస్తాం.. ఈ సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు''..

ఇక కోహ్లి ఒక సందర్బంలో నా దగ్గరికి వచ్చాడు. కానీ అదే సమయంలో నా బ్యాట్‌ కిందపడిపోవడంతో ఏం మాట్లాడకుండా బ్యాట్‌ తీసుకోవడానికి కిందకు వంగాను. కోహ్లి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మేము మ్యాచ్‌ గెలవడం.. ఆపై టైటిల్‌ గెలవడం జరిగిపోయింది'' అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌ 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్లో  ముంబై ఇండియన్స్‌ ఐదు వికెట్ల తేడాతో నెగ్గి ఐదోసారి ఐపీఎల్‌ టైటిల్‌ ఎగురేసుకపోయింది.

చదవండి: IPL 2022: కోహ్లి చెత్త రికార్డు.. ప్లీజ్‌.. భారంగా మారొద్దు.. ఇకనైనా!

Kohli-Wasim Jaffer: కోహ్లి పరిస్థితిని కళ్లకు కట్టిన టీమిండియా మాజీ క్రికెటర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top