
చెన్నై: ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 420 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో టీమిండియా చతకిలబడింది. టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌ను 192 పరుగులకే ముగించి ఓటమి చెందింది. దాంతో సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉంచితే, ఇంగ్లండ్ బ్యాటింగ్ చేసే క్రమంలో ఆ జట్టులోని కొందరు ఆటగాళ్లు పిచ్ మధ్యలో పరుగెత్తారు. ఇది కోహ్లికి తీవ్ర అసహనానికి గురిచేసింది.
ఈ క్రమంలోనే అంపైర్లపై చిరాకు పడ్డాడు కోహ్లి. అసలు ఫీల్డ్ అంపైర్లు ఏం చూస్తున్నారు అనే అర్థం వచ్చేలా అంపైర్ నితిన్ మీనన్‌ను ఉద్దేశించి అరిచి మరీ చెప్పాడు విరాట్. ‘ ఓయ్ నితిన్ మీనన్.. వారు పిచ్ మధ్యలో పరుగెడుతూ ఈజీగా సింగిల్స్ తీస్తున్నారు’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.ఇది నాల్గో రోజు(సోమవారం) ఆటలో చోటు చేసుకుంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆడే క్రమంలో ఇది జరిగింది. ఆ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 178 పరుగులకే ఆలౌటైంది. కానీ టీమిండియాకు ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఇంగ్లండ్ ఎక్కువ ఓవర్లు ఆడేందుకు యత్నించింది. అయితే నిన్ననే రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా విజయం సాధించి ఏమైనా అద్భుతం చేస్తుందా అని భావించినా నిరాశే ఎదురైంది. ఇక్కడ చదవండి: ఒక్క విజయంతో టాప్‌కు దూసుకెళ్లింది
Credits-@/aumbetiroydo on insta
— Jay (@Aragorn_2_) February 8, 2021
😂😂 pic.twitter.com/amH0VE3vUt