ఈ ఏడాది గూగుల్‌ టాప్‌ సెర్చ్‌లో ముగ్గురు టీమిండియా క్రికెటర్లు | Kiara Advani Is The Most 'Googled' Person In 2023, Number 2 Is Shubman Gill - Sakshi
Sakshi News home page

ఈ ఏడాది గూగుల్‌ టాప్‌ సెర్చ్‌లో ముగ్గురు టీమిండియా క్రికెటర్లు

Dec 11 2023 8:43 PM | Updated on Dec 22 2023 3:49 PM

Kiara Advani Is The Most Googled Person In 2023, Number 2 Is Shubman Gill - Sakshi

ఈ ఏడాది (2023) భారత దేశంలో అత్యధిక మంది గూగుల్‌ చేసిన వ్యక్తుల వివరాలను గూగల్‌ సంస్థ ఇవాళ వెల్లడించింది. ఈ జాబితాలో ప్రముఖ బాలీవుడ్‌ నటి కియారా అడ్వానీ టాప్‌లో ఉండగా.. టీమిండియా యువ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితా టాప్‌-10లో ఏకంగా ఆరుగురు క్రికెటర్లు ఉండగా.. టీమిండియాకు చెందిన వారు ముగ్గురు ఉండటం విశేషం. 

గిల్‌ రెండులో, మొహమ్మద్‌ షమీ నాలుగో స్థానంలో, సూర్యకుమార్‌ యాదవ్‌ తొమ్మిదో ప్లేస్‌లో ఉండగా.. న్యూజిలాండ్‌ నయా సెన్సేషన్‌ రచిన్‌ రవీంద్ర మూడో స్థానంలో, ఆసీస్‌ విధ్వంసకర ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఏడులో, వరల్డ్‌కప్‌ ఫైనల్‌ హీరో ట్రవిస్‌ హెడ్‌ పదో స్థానంలో ఉన్నారు. కియారా అడ్వానీ భర్త సిద్దార్థ్‌ మల్హోత్రా ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉండగా.. ప్రముఖ యూట్యూబర్‌ ఎల్విష్‌ యాదవ్‌ ఐదులో, మాజీ ఫుట్‌బాలర్‌ డేవిడ్‌ బెక్‌హామ్‌ ఎనిమిదో స్థానంలో నిలిచారు.

ఇండియాలో ఈ ఏడాది అత్యధికంగా గూగుల్ చేయబడిన చిత్రాల విషయానికి వస్తే.. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ (మొదటి స్థానం), పఠాన్ (ఐదో ప్లేస్‌) సినిమాలు టాప్‌-5లో నిలిచాయి. 

ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా గూగుల్ చేయబడిన సినిమాలు..

  1. జవాన్‌
  2. గదర్‌ 2
  3. ఓపెన్‌హైమర్‌
  4. ఆదిపురుష్‌
  5. పఠాన్‌
  6. ద కేరళ స్టోరీ
  7. జైలర్‌
  8. లియో
  9. టైగర్‌ 3
  10. వారీసు
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement