
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుకు ముందు భారత తుది జట్టులో ఒక ఆటగాడి పేరు చూసి అంతా ఆశ్చర్యపోయారు. మూడు మ్యాచ్‌లలో విఫలమైనా మళ్లీ అవకాశమెందుకు ఇచ్చారు? స్వ్కాడ్‌లో అతడి తప్ప ఇంకా ఎవరూ లేరా? అస్సలు గంభీర్‌కు కొంచమైనా తెలివిందా? అంటూ మెనెజ్‌మెంట్‌పై ప్రశ్నల వర్షం కురిసింది.
కానీ సదరు ఆటగాడు ఈ ప్రశ్నలన్నింటికి తన ఆటతోనే సమాధానమిచ్చాడు. ఇదంతా ఎవరి కోసమో మీకు ఇప్పటికే మీకు ఓ అంచనా వచ్చి ఉంటుంది. అవును మీరు అనుకుంటుంది నిజమే, ఇదంతా టీమిండియా వెటరన్ కరుణ్ నాయర్ కోసమే.
8 ఏళ్ల నిరీక్షణ తర్వాత...
కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్‌లో అద్బుతంగా రాణించి 8 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేశాడు. కానీ తన రీఎంట్రీలో ఈ కర్ణాటక ఆటగాడు అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడిన నాయర్.. ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు.
తనకు దక్కిన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యాడు. ఈక్రమంలో నాలుగో టెస్టుకు మెనెజ్‌మెంట్ అతడికి విశ్రాంతి ఇచ్చింది. దీంతో అతడి అంతర్జాతీయ కెరిర్ ముగిసిందన్న చర్చ నడిచింది. మరికొంతమంది అయితే ఓ అడుగు ముందుకేసి నాయర్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని ప్రచారం చేశారు.
మరో ఛాన్స్..
కానీ కరుణ్ నాయర్‌కు టీమిండియా మెనెజ్‌మెంట్ చివరగా మరోసారి అవకాశం కల్పించింది. లండన్‌లోని ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో ప్రారంభమైన ఐదో టెస్టుకు నాయర్ అనూహ్యంగా ఎంపికయ్యాడు. శార్ధూల్ ఠాకూర్ బదులుగా కరుణ్‌కు ఛాన్స్ ఇచ్చారు. ఈసారిమాత్రం కరుణ్ నాయర్ తనకు వచ్చిన అవకాశాన్నిరెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.
కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్, గిల్ వంటి కీలక ఆటగాళ్లు విఫలమైనప్పటికి నాయర్ మాత్రం తన అద్బుత బ్యాటింగ్‌తో సత్తాచాటాడు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెరుగుతున్నచోట నాయర్ తన ఆసాధరణ ప్రదర్శనతో అడ్డుగోడలా నిలిచాడు. ధ్రువ్ జురెల్, సుందర్‌లతో కలిసి కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు.
ఈ క్రమంలో కరుణ్ తన టెస్టు కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. అంతకుముందు 2016లో ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ చేసిన నాయర్ మళ్లీ ఇప్పుడు అదే జట్టుపై 3146 రోజుల తర్వాత ఆర్ధ శతకం సాధించాడు. నాయర్ 52 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. రెండో రోజు ఆటలో నాయర్ బ్యాటింగ్ చాలా కీలకంగా మారనుంది.
చదవండి: IND vs ENG 5th Test: ఇంగ్లండ్‌కు భారీ షాక్.. మ్యాచ్ మధ్యలోనే అస్పత్రికి