IPL 2023 RCB vs KKR: కేకేఆర్‌ హీరో జాసన్‌ రాయ్‌కు భారీ జరిమానా..

Jason Roy fined 10 percent of match fees due to Code of Conduct breach - Sakshi

ఐపీఎల్‌-2023లో చిన్నస్వామి స్టేడియం వేదికగా జగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో తన హోం గ్రౌండ్‌లోనే ఆర్సీబీని చిత్తు చేసింది. 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులకే పరిమితమైంది.

ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి(54), లామ్రోర్‌(34) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి మూడు వికెట్లు, రస్సెల్‌, సుయాష్‌ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన  కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులుచేసింది. కేకేఆర్‌ బ్యాటర్లలో జాసన్‌ రాయ్‌(56), నితీష్‌ రాణా(48) పరుగులతో రాణించారు. 

జాసన్‌ రాయ్‌కు జరిమానా
ఇక ఈ మ్యాచ్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన కేకేఆర్‌ ఓపెనర్‌ జాసన్‌ రాయ్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రాయ్‌కు మ్యాచ్‌ రిఫరీ జరిమానా విధించాడు. అతడి మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు ఐపీఎల్‌ ఓ ప్రకటనలో పేర్కొ‍ంది. అతడు ఐపీఎల్‌  ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.2ను రాయ్‌ ఉల్లంఘించినట్లు తెలిపింది. ఈ నియమం ప్రకారం ఆటగాడు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తే జరిమానా విధిస్తారు. అయితే రాయ్‌ ఏమి నేరం చేశాడన్నది ఐపీఎల్‌ నిర్వాహకులు వెల్లడించలేదు.
చదవండిShahbaz Ahmed: 2.4 కోట్లు పెట్టి కొన్నారు.. గల్లీ క్రికెటర్‌ కంటే హీనం.. పైగా ఆల్‌రౌండరట..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top