టోక్యో: పురుషుల టెన్నిస్‌లో ఆసియా అత్యుత్తమ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న జపాన్ ప్లేయర్ కి నిషికొరి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది తర్వాత టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పనున్నానని తెలిపాడు. 36 ఏళ్ల నిషికొరి 2014లో యూఎస్ ఓపెన్ ఫైనల్లో మారిన్ సిలిచ్ (క్రొయేషియా) చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు. తద్వారా గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచిన తొలి ఆసియా ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.
2007లో ప్రొఫెషనల్‌గా మారిన నిషికొరి 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచాడు. కాంస్య పతక మ్యాచ్‌లో అతను స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్‌ను మూడు సెట్‌లలో ఓడించాడు. 2017లో కెరీర్ బెస్ట్ 4వ ర్యాంక్ అందుకున్న నిషికొరి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో నాలుగుసార్లు (2012, 2015, 2016, 2019)... ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడుసార్లు (2015, 2017, 2019)... వింబుల్డన్ టోరీ్నలో రెండుసార్లు (2018, 2019) క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. కెరీర్ మొత్తంలో 12 ఏటీపీ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన నిషికొరి 451 మ్యాచ్‌ల్లో గెలిచి, 231 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు.
2019లో చివరిసారి బ్రిస్బేన్ ఓపెన్‌లో టైటిల్ నెగ్గిన నిషికొరి ఆ తర్వాత మరో టోరీ్నలో విజేతగా నిలువలేదు. భుజం గాయంతో బాధపడుతున్న నిషికొరి గత ఏడాది యూఎస్ ఓపెన్‌లో, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ ఆడలేదు. ప్రస్తుతం 464వ ర్యాంక్‌లో ఉన్న ఈ జపాన్ ప్లేయర్ చాలెంజర్ టోరీ్నల్లో ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో ఐదు చాలెంజర్ టోరీ్నల్లో పోటీపడ్డ నిషికొరి ఒక్క దాంట్లోనూ కనీసం క్వార్టర్ ఫైనల్ చేరలేకపోయాడు.


