'అత‌డు మ‌రొక అభిషేక్ శర్మ.. వారికి టెన్షన్‌ మొదలైంది' | Salil Arora Set To Make IPL Debut For SRH In 2026, Irfan Pathan Draws Parallels Between Abhishek Sharma And Uncapped SRH Star | Sakshi
Sakshi News home page

IPL 2026: 'అత‌డు మ‌రొక అభిషేక్ శర్మ.. వారికి టెన్షన్‌ మొదలైంది'

Mar 23 2026 9:08 PM | Updated on Mar 24 2026 12:14 PM

Irfan Pathan draws parallels between Abhishek Sharma and uncapped SRH star

పంజాబ్ యువ సంచలనం సలీల్ అరోరా తొలిసారి ఐపీఎల్‌లో ఆడేందుకు సిద్దమవుతున్నాడు. ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అరోరా ప్రాతినిథ్యం వహించనున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో భారీ హిట్టర్‌గా పేరొందిన ఆరోరా.. ఇప్పుడు ఐపీఎల్ వంటి పెద్ద టోర్నీలో ఎలా రాణిస్తాడో అందరూ అతృతగా ఎదరుచూస్తున్నారు.

గతేడాది జరిగిన వేలంలో పోటీపడి మరి రూ. 1.50 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ దక్కించుకుంది. ఇటీవల జరిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఇంట్రాస్క్వాడ్  మ్యాచ్‌లో కూడా అరోరా విధ్వంసం సృష్టించాడు. కేవలం 13 బంతుల్లో 40 పరుగులు చేసి సత్తాచాటాడు. అతడు వరుసగా ఐదు బంతుల్లో 5 సిక్సర్లు బాది అందరిని ఆశ్చర్యపరిచాడు.

ప్రధాన టోర్నీలోనూ ఇదే జోరును కొనసాగించాలని సన్‌రైజర్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సలీల్‌ ఆరోరాపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20 వ‌ర‌ల్డ్ నెం1 బ్యాట‌ర్ అభిషేక్ శ‌ర్మ‌తో అరోరాను ప‌ఠాన్ పోల్చాడు. కాగా అభిషేక్‌, అరోరా ఇద్ద‌రూ పంజాబ్‌కు చెందిన‌వారే కావ‌డం గ‌మ‌నార్హం.

"స‌లీల్ అరోరా కూడా పంజాబ్ క్రికెట్ నుంచే వ‌చ్చాడు. ఇప్ప‌టికే దేశ‌వాళీ క్రికెట్‌లో త‌న స‌త్తాను నిరూపించుకున్నాడు. అభిషేక్ శ‌ర్మ‌, నమన్ ధీర్, రమన్‌దీప్ సింగ్ వంటి ఆటగాళ్లు పంజాబ్ నుండి వ‌చ్చి త‌మకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు సలీల్ కూడా అదే జాబితాలో చేరేలా క‌న్పిస్తున్నాడు. 

వేలంలో అత‌డిని ఎస్ఆర్‌హెచ్ ఒక బ్యాక‌ప్ ఆట‌గాడిగా తీసుకుంది. కాబ‌ట్టి ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి ఫామ్‌లో లేకపోయినా, లేదా అనికేత్ వర్మ సరిగ్గా ఆడకపోయినా సలీల్‌కు అవ‌కాశం ద‌క్కుతుంది.  బెంచ్‌పై సలీల్ వంటి ప్రతిభావంతుడు ఉన్నందున.. నితీశ్‌, అనికేత్‌పై కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది" అని ప‌ఠాన్ త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IPL 2026: జ‌స్ప్రీత్ బుమ్రాకు ఏమైంది?

Advertisement
 
Advertisement
Advertisement