వైభవ్‌, జురెల్‌ ఫిప్టీలు.. ఆర్సీబీపై రాజస్తాన్‌ ఘన విజయం | IPL 2026: Royal challengers vs Rajasthan royals match live updates | Sakshi
Sakshi News home page

IPL 2026 RR vs RCB: వైభవ్‌, జురెల్‌ ఫిప్టీలు.. ఆర్సీబీపై రాజస్తాన్‌ ఘన విజయం

Apr 10 2026 7:07 PM | Updated on Apr 11 2026 12:04 AM

IPL 2026: Royal challengers vs Rajasthan royals match live updates

RCB vs RR Live Updates: ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ రాయల్స్‌ వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. గౌహతి వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ విజయం సాధించింది. 202 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలో చేధించింది.

లక్ష్య చేధనలో రాజస్తాన్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్‌.. 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 78 పరుగులు చేశాడు.  అతడితో పాటు ధ్రువ్ జురెల్‌(43 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 81 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 

ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్‌, కృనాల్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు ఆర్సీబీ  నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌(40 బంతుల్లో 4 ఫోర్లు,4 సిక్స్‌లతో 63) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్‌ అయ్యర్‌(29), షెఫర్డ్‌(22), విరాట్‌ కోహ్లి(32) రాణించారు.

విజయానికి చేరువలో రాజస్తాన్‌
రాజస్తాన్‌ విజయానికి 24 బంతుల్లో 18 పరుగులు కావాలి. క్రీజులో ధ్రువ్‌ జురెల్‌(66), రవీంద్ర జడేజా(21) ఉన్నారు.

రాజస్తాన్ నాలుగో వికెట్ డౌన్‌
రాజస్తాన్ రాయల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌.. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రాజస్తాన్ విజయానికి 62 బంతుల్లో 68 పరుగులు కావాలి.

రాజస్తాన్‌ మూడో వికెట్‌ డౌన్‌
రాజస్తాన్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో షెమ్రాన్‌ హెట్‌మైర్‌ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.

రాజస్తాన్‌ రెండో వికెట్‌ డౌన్‌
వైభవ్‌ సూర్యవంశీ రూపంలో రాజస్తాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. కేవలం 26 బంతుల్లో 78 పరుగులు చేసిన వైభవ్‌.. కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

దూకుడుగా ఆడుతున్న వైభవ్‌, జురెల్‌
6 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 97/1. క్రీజులో ధ్రువ్‌ జురెల్‌(27), వైభవ్‌ సూర్యవంశీ(57) ఉన్నారు.

వైభవ్‌ విధ్వంసం
వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసం సృష్టిస్తున్నాడు. జోష్ హాజిల్‌వుడ్ వేసిన ఐదో ఓవర్‌లో వైభవ్‌.. ఏకంగా 19 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో 17 పరుగులు రాబట్టాడు. కేవలం 15 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 5 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 73/1

దూకుడుగా ఆడుతున్న వైభవ్‌
3 ఓవర్లకు రాజస్తాన్‌ వికెట్‌ నష్టానికి 37 పరుగులు చేసింది. క్రీజులో వైభవ్‌ సూర్యవంశీ(23), ధ్రువ్‌ జురెల్‌(1) ఉన్నారు.

రాజస్తాన్ తొలి వికెట్ డౌన్‌
రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్‌.. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

పాటిదార్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. రాజస్తాన్‌ ముందు భారీ టార్గెట్‌
గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు దంచి కొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌(40 బంతుల్లో 4 ఫోర్లు,4 సిక్స్‌లతో 63) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్‌ అయ్యర్‌(29), షెఫర్డ్‌(22), విరాట్‌ కోహ్లి(32) రాణించారు. రాజస్తాన్‌ బౌలర్లలో రవి బిష్ణోయ్‌, బ్రిజేష్‌ శర్మ, జోఫ్రా ఆర్చర్‌ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు సందీప్‌ శర్మ, రవీంద్ర జడేజాతలా వికెట్‌ సాధించారు.

ఆర్సీబీ ఎనిమిదో వికెట్‌ డౌన్‌
ఆర్సీబీ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. 63 పరుగులు చేసిన రజిత్‌ పాటిదార్‌.. సందీప్‌ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఆర్సీబీ ఏడో వికెట్‌ డౌన్‌
ఆర్సీబీ ఏడో వికెట్‌ కోల్పోయింది. 22 పరుగులు చేసిన రోమారియో షెపర్డ్.. జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 16 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 150/7. పాటిదార్‌ 50 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

ఆర్సీబీ ఆరో వికెట్‌ డౌన్‌
ఆర్సీబీ ఆరో వికెట్‌ కోల్పోయింది. 13 పరుగులు చేసిన టిమ్‌ డేవిడ్‌.. బ్రిజేష్‌ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 94/6

ఆర్సీబీ ఐదో వికెట్‌ డౌన్‌
ఆర్సీబీ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 7 ఓవర్‌ వేసిన రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో కృనాల్‌ పాండ్యా ఔట్‌ కాగా.. 8 ఓవర్‌ లో బ్రిజేస్‌ బౌలింగ్‌లో జితేశ్‌ శర్మ ఔటయ్యాడు. 9 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 82/5

ఆర్సీబీ మూడో వికెట్ డౌన్‌
ఆర్సీబీ మూడో వికెట్‌ కోల్పోయింది. 32 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లి.. రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

ఆర్సీబీ రెండో వికెట్‌ డౌన్‌
ఆర్సీబీ రెండో వికెట్‌ కోల్పోయింది. 14 పరుగులు చేసి పడిక్కల్‌ జోఫ్రా అర్చర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 45-2

ఆర్సీబీకీ భారీ షాక్‌
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. జోఫ్రా అర్చర్‌ బౌలింగ్‌లో తొలి బంతికే ఫిల్‌ సాల్ట్‌ ఔటయ్యాడు. క్రీజులోకి దేవ్‌దత్త్‌ పడిక్కల్‌ వచ్చాడు. 2 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 32/1

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న రాజస్తాన్‌
ఐపీఎల్‌-2026 సీజన్‌లో భాగంగా గౌహతి వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఓ మార్పుతో బరిలోకి దిగింది. తుషార్‌ దేశ్‌పాండే స్ధానంలో బ్రిజేశ్‌ శర్మ తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఆర్సీబీ స్టార్‌ పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ ఎట్టకేలకు పునరాగమనం చేశాడు. జాకబ్‌ డఫీ స్ధానంలో హాజిల్‌వుడ్‌ జట్టులోకి వచ్చాడు.

తుది జ‌ట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ : విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్‌), జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జోష్ హాజిల్‌వుడ్

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్: యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), రియాన్ పరాగ్ (కెప్టెన్‌), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ
 

తగ్గిన వర్షం
అభిమానులకు గుడ్‌ న్యూస్‌. గౌహతిలో వర్షం ఆగింది. దీంతో టాస్‌ 8:00 గంటలకు పడనుండగా.. మ్యాచ్‌ 8:15కు ప్రారంభం కానుంది.

టాస్‌ ఆలస్యం
ఐపీఎల్‌-2026లో భాగంగా గౌహ‌తి వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్లు మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది. పిచ్‌ను ప్ర‌స్తుతం క‌వ‌ర్ల‌తో క‌ప్పి ఉంచారు. దీంతో షెడ్యూల్ ప్ర‌కారం 7:00 గంట‌ల‌కు ప‌డాల్సిన టాస్ ఇప్పుడు ఆల‌స్యం కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement