IPL 2026: కేకేఆర్‌కు బిగ్‌ న్యూస్‌ | IPL 2026: Pathirana set to join KKR squad after obtaining NOC | Sakshi
Sakshi News home page

IPL 2026: కేకేఆర్‌కు బిగ్‌ న్యూస్‌

Apr 12 2026 5:35 PM | Updated on Apr 12 2026 5:43 PM

IPL 2026: Pathirana set to join KKR squad after obtaining NOC

ఐపీఎల్‌ 2026లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న కేకేఆర్‌కు బిగ్‌ న్యూస్‌ అందింది. రూ. 18 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న శ్రీలంక పేసర్‌ మతిష పతిరణ త్వరలో జట్టులో చేరబోతున్నాడు. సొంత దేశ క్రికెట్‌ బోర్డు (SLC) నుంచి అతనికి NOC లభించింది. గాయం కారణంగా పతిరణ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజాగా అతను ఫిట్‌నెస్‌ టెస్ట్‌ క్లియర్‌ చేసి, SLC అనుమతితో ఐపీఎల్‌ 2026లో అడుగుపెట్టబోతున్నాడు.

ఏప్రిల్‌ 14న సీఎస్‌కేతో జరుగబోయే మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండనున్నాడు. పతిరణ రాక కేకేఆర్‌ బౌలింగ్‌ విభాగానికే కాకుండా జట్టు యావత్తుకు బలాన్ని చేకూరుస్తుంది. ఈ సీజన్‌లో ఆ జట్టు హర్షిత్‌ రాణా, ఆకాశ్‌దీప్‌ సేవలు కోల్పోయి పేలవ ప్రదర్శనలు చేస్తుంది. ఇప్పుడు పతిరణ రాక కేకేఆర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.

కాగా, ఈ సీజన్‌లో కేకేఆర్‌ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఆ జట్టుకు అదృష్టం కూడా కలిసి రావడం లేదు. గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓటమిపాలవడంతో పాటు ఓ మ్యాచ్‌ అన్యాయంగా వర్షార్పణం అయ్యింది.

ఇదిలా ఉంటే, పతిరణ గైర్హాజరీలో విదేశీ పేసర్‌గా జింబాబ్వే పేసర్‌ బ్లెస్సింగ్‌ ముజరబానీ పలు మ్యాచ్‌లు ఆడాడు. అయితే అతని నుంచి ఆశించి ఫలితాలు రాకపోవడంతో కేకేఆర్‌కు చేదు అనుభవాలు మిగిలాయి. చివరికి గాయంతో బాధపడుతున్న గ్రీన్‌తో బౌలింగ్‌ చేయించినా సానుకూల ఫలితాలు రాలేదు. సీజన్‌ ప్రారంభానికి ముందే ముస్తాఫిజుర్‌ రూపంలో కేకేఆర్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement