IPL 2026: రెచ్చిపోయిన రహానే.. కేకేఆర్‌ భారీ స్కోర్‌ | IPL 2026 Match 2: KKR set 221 runs target to MI | Sakshi
Sakshi News home page

IPL 2026: రెచ్చిపోయిన రహానే.. కేకేఆర్‌ భారీ స్కోర్‌

Mar 29 2026 9:31 PM | Updated on Mar 29 2026 9:31 PM

 IPL 2026 Match 2: KKR set 221 runs target to MI

ఐపీఎల్‌ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మార్చి 29) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ భారీ స్కోర్‌ చేసింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.

రెచ్చిపోయిన రహానే
కేకేఆర్‌ కెప్టెన్‌ రహానే లేటు వయసులో రెచ్చిపోయి, కేకేఆర్‌కు మెరుపు ఆరంభాన్ని అందించాడు. కేవంల 27 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన అతను.. మొత్తంగా 40 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేశాడు. రహానేకు జతగా ఓపెనింగ్‌ చేసిన ఫిన్‌ అలెన్‌ కూడా చెలరేగిపోయాడు. కేవలం 17 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు.

25 కోట్ల ప్లేయ‌ర్ అట్ట‌ర్ ప్లాప్‌
ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత ఖ‌రీదైన విదేశీ ఆట‌గాడిగా నిలిచిన కెమరూన్‌ గ్రీన్‌ దారుణంగా విఫలమయ్యాడు. అలెన్‌ ఔటయ్యాక వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన గ్రీన్‌.. 10 బంతుల్లో బౌండరీ, సిక్సర్‌ సాయంతో 18 ప‌రుగులు చేసి ఔటయ్యాడు. ఈ సీజన్‌ వేలంలో కేకేఆర్‌ గ్రీన్‌ను రూ. 25.20 కోట్ల భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది.

రాణించిన రఘువంశీ
గ్రీన్‌ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన అంగ్క్క్రిష్‌ రఘువంశీ ఆరంభంలో కాస్త నిదానంగా ఆడినా, ఆతర్వాత బ్యాట్‌ ఝులిపించాడు. 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. రఘువంశీ మెరుపుల కారణంగానే కేకేఆర్‌ 200 పరుగుల మార్కును దాటగలిగింది.

పర్వాలేదనిపించిన రింకూ 
ఇన్నింగ్స్‌ చివర్లో బరిలోకి దిగిన రింకూ సింగ్‌ తన సహజ శైలిలో మెరుపు బ్యాటింగ్‌ చేయనప్పటికీ పర్వాలేదనిపించాడు. 21 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 33 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై ఇండియన్స్‌ బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ (4-0-39-3), ట్రెంట్‌ బౌల్ట్‌ (4-0-38-0) అద్భుతంగా బౌలింగ్‌ చేయగా..హార్దిక్‌ పాండ్యా ఓ వికెట్‌ తీశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement