ఐపీఎల్ 2026లో కేకేఆర్ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ వైఫల్యాల పరంపరం కొనసాగుతోంది. నిన్న (ఏప్రిల్ 14) సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో అతను గోల్డెన్ డకౌటై, తీవ్రంగా నిరాశపరిచాడు. జట్టుకు తన అనవసరం చాలా ఉన్నప్పుడు కూడా చేతులెత్తేయడాన్ని కేకేఆర్ అభిమానులు జీర్ణంచుకోలేకపోతున్నారు. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో వైఫల్యాలను పెద్దగా పట్టించుకోని వారు కూడా సీఎస్‌కే మ్యాచ్ వైఫల్యం తర్వాత విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
తాజా వైఫల్యం తర్వాత కేకేఆర్ కోర్ అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వారి ఆగ్రహజ్వాలలు కట్టలు తెంచుకున్నాయి. వాడొక మోసగాడు అంటూ పరుష పదజాలంతో దూషిస్తున్నారు. ఆస్ట్రేలియా ఆటగాడు కాకపోతే అతనికి రూ. 5 కోట్లు కూడా దక్కేవి కావని అంటున్నారు. కొందరు ఆతన్ని గతంలో విఫలమైన ఆటగాళ్లతో పోలుస్తూ వ్యంగ్యంగా ట్వీట్లు చేశారు. గ్రీన్ కంటే 20-30 లక్షలు పెట్టి కొన్న స్వదేశీ ఆటగాళ్లు చాలా మేలని అభిప్రాయపడుతున్నారు.
కాగా, గ్రీన్‌ను కేకేఆర్ ఈ సీజన్ వేలంలో రూ. 25.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. గ్రీన్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. ఇంత భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన గ్రీన్ వరుసగా విఫలమవుతుంటే ఏ ఫ్రాంచైజీ అభిమానులకైనా కడుపులో మండుతుంది. పైగా గ్రీన్ ఈ సీజన్‌లో మొదటి మూడు మ్యాచ్‌ల్లో గాయాన్ని సాకుగా చూపుతూ బౌలింగ్ కూడా చేయలేదు. మొత్తంగా గ్రీన్ వైఫల్యాలు కేకేఆర్ కొంపముంచాయి. అతని బదులు ఏ స్వదేశీ ఆల్‌రౌండర్‌ను నమ్ముకున్నా, ఇంతకంటే మెరుగైన ఫలితాలే వచ్చేవి.
తాజాగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో గ్రీన్ బౌలింగ్‌ను సీఎస్‌కే యువ ఆటగాడు ఆయుశ్ మాత్రే చెడుగుడు ఆడుకున్నాడు. అతను వేసిందే 2 ఓవర్లు, అందులోనే 20 పరుగులు రాబట్టాడు. మొత్తంగా గ్రీన్ తాను వేసిన 2 ఓవర్లలో వికెట్ లేకుండా 30 పరుగులు సమర్పించుకున్నాడు.
బ్యాటింగ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో అతను చేసింది ఎంతమాత్రం కూడా న్యాయం కాదనిపించింది. జట్టుకు తన అవసరం చాలా ఉన్నప్పుడు (85-4) క్రీజ్‌లోకి వచ్చి గోల్డెన్ డకౌటయ్యాడు. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇలా ఔట్ కావడాన్ని ఏ కేకేఆర్ అభిమాని కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. సోషల్‌మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. వాడికి 25 కోట్లు కాదు, 25 లక్షలు కూడా ఎక్కువే అని కామెంట్లు చేస్తున్నారు.
ఈ సీజన్‌లో గ్రీన్ ప్రదర్శనలు..
ముంబై ఇండియన్స్‌పై 18 (10)
ఎస్‌ఆర్‌హెచ్‌పై 2 (2)
పంజాబ్ కింగ్స్‌పై 4 (2)
లక్నోపై 32 నాటౌట్ (24), (2-0-28-1)
సీఎస్‌కేపై (2-0-20-0), 0 (1)
గ్రీన్ వైఫల్యాలు ప్రత్యక్షంగా కేకేఆర్ విజయావకాశాలను ప్రభావితం చేశాయి. ఆ జట్టు ఈ సీజనలో ఇప్పటివరకు ఖాతా కూడా తెరవలేదు. ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్ సీఎస్‌కే చేతిలో 32 పరుగుల తేడాతో పరాజయం ఎదుర్కొంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే.. సంజూ శాంసన్ (48), డెవాల్డ్ బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.
అనంతరం బరిలోకి దిగిన కేకేఆర్ నూర్ అహ్మద్ (4-0-21-3), అన్షుల్ కంబోజ్ (4-0-32-2), అకీల్ హొసేన్ (4-0-26-1) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 35 పరుగులు చేసిన రమన్‌దీప్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.


