ఉర్విల్‌ పటేల్‌ సరికొత్త చరిత్ర.. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ | IPL 2026 CSK VS LSGL: Urvil patel scores 13 ball fifty | Sakshi
Sakshi News home page

ఉర్విల్‌ పటేల్‌ సరికొత్త చరిత్ర.. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ

May 10 2026 6:42 PM | Updated on May 10 2026 6:42 PM

IPL 2026 CSK VS LSGL: Urvil patel scores 13 ball fifty

ఐపీఎల్‌ 2026లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఇవాళ (మే 10) జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాటర్‌ ఉర్విల్‌ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం​ 13 బంతుల్లోనే ఓ ఫోర్‌, 7 సిక్సర్ల సాయంతో అర్ద సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఇది అత్యంత వేగవంతమైన హాఫ్‌ సెంచరీ. గతంలో ఈ రికార్డు రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ పేరిట ఉండేది. జైస్వాల్‌ కూడా 13 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. తాజాగా ఈ రికార్డును ఉర్విల్‌ జైస్వాల్‌తో సంయుక్తంగా పంచుకున్నాడు.

ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్‌ సెంచరీలు
13 - యశస్వి జైస్వాల్ (RR) vs KKR, కోల్‌కతా, 2023
13 - ఉర్విల్ పటేల్ (CSK) vs LSG, లక్నో, 2026
14 - KL రాహుల్ (PBKS) vs DC, మొహాలి, 2018
14 - ప్యాట్ కమిన్స్ (KKR) vs MI, పుణే, 2022
14 - రొమారియో షెపర్డ్ (RCB) vs CSK, బెంగళూరు, 2025

సరికొత్త చరిత్ర
ఈ ఇన్నింగ్స్‌తో ఉర్విల్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో తొలి 10 బంతుల తర్వాత అత్యధిక స్కోర్‌ (42) చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉండేది. 2015 ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్‌ తొలి 10 బంతుల తర్వాత 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. తాజాగా ఈ రికార్డును ఉర్విల్‌ బద్దలు కొట్టాడు.

ఐపీఎల్‌లో మొదటి 10 బంతుల తర్వాత అత్యధిక స్కోర్లు
42* - ఉర్విల్ పటేల్ vs LSG, చెన్నై, 2026
41* - AB డివిలియర్స్ vs MI, బెంగళూరు, 2015
41* - యశస్వి జైస్వాల్ vs KKR, కోల్‌కతా, 2023
40* - అభిషేక్ శర్మ vs DC, ఢిల్లీ, 2024
39* - రొమారియో షెపర్డ్ vs DC, ముంబై WS, 2024
39* - ప్రియాంష్ ఆర్య vs CSK, చెన్నై, 2026

మ్యాచ్‌ విషయానికొస్తే.. 204 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సీఎస్‌కే దూసుకుపోతుంది. తొలి 10 ఓవర్లలో ఏకంగా 132 పరుగులు చేసి లక్ష్యం​ దిశగా సాగుతోంది. ఉర్విల్‌ 23 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 65 పరుగులు చేసి ఔటయ్యాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ (33), కార్తీక్‌ శర్మ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే గెలవాలంటే 60 బంతుల్లో మరో 73 పరుగులు చేయాల్సి ఉంది.

అంతకుముందు లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. జోష్‌ ఇంగ్లిస్‌ (85) ఊచకోత కోశాడు. ఆఖర్లో షాబాజ్‌ అహ్మద్‌ (43 నాటౌట్‌) రాణించాడు. వీరు మినహా ఎవరూ పెద్ద స్కోర్‌ చేయలేదు. మిచెల్‌ మార్ష్‌ 10, నికోలస్‌ పూరన్‌ 1, రిషబ్‌ పంత్‌ 15, మార్క్రమ్‌ 6, రఘువంశీ 18, హిమ్మత్‌ సింగ్‌ 17, షమీ డకౌటయ్యారు. సీఎస్‌కే బౌలర్లలో జేమీ ఓవర్టన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. అన్షుల్‌ కంబోజ్‌ 2, నూర్‌ అహ్మద్‌ ఓ వికెట్‌ తీశాడు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement