హైస్కోరింగ్ థ్రిల్ల‌ర్‌లో గుజ‌రాత్‌పై పంజాబ్ గెలుపు | IPL 2025: Gujarat Titans vs Punjab kings live updates and highlights | Sakshi
Sakshi News home page

IPL 2025: హైస్కోరింగ్ థ్రిల్ల‌ర్‌లో గుజ‌రాత్‌పై పంజాబ్ గెలుపు

Published Tue, Mar 25 2025 7:04 PM | Last Updated on Tue, Mar 25 2025 11:28 PM

IPL 2025: Gujarat Titans vs Punjab kings live updates and highlights

GT vs PBKS Live Updates And highlights: 

గుజరాత్‌పై పంజాబ్‌ విజయం
ఐపీఎల్‌-2025ను గుజరాత్‌ విజయంతో ఆరంభించింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన హై స్కోరింగ్ థ్రిల్ల‌ర్‌లో 11 ప‌రుగుల తేడాతో పంజాబ్ విజ‌యం సాధించింది. 244 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టీమ్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 232 ప‌రుగులు చేసింది. 

గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో సాయిసుద‌ర్శ‌న్‌(74), జోస్ బ‌ట్ల‌ర్‌(54) రూథ‌ర్ ఫ‌ర్డ్‌(46) పోరాడిన‌ప్ప‌ట‌కి త‌మ జ‌ట్టును విజ‌యతీరాల‌కు చేర్చ‌లేక‌పోయారు. కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌(33) త‌న వంతు ప్ర‌య‌త్నం చేశాడు. కానీ కొండంత ల‌క్ష్యాన్ని క‌రిగించ‌లేక‌పోయారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్‌ రెండు, జానెస‌న్‌, మాక్స్‌వెల్ త‌లా వికెట్ సాధించారు.
17 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోర్‌: 187/2
17 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ టైటాన్స్ రెండు వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు చేసింది. క్రీజులో జోస్ బ‌ట్ల‌ర్‌(47), రూథ‌ర్ ఫ‌ర్డ్‌(23) ప‌రుగుల‌తో ఉన్నారు.

15 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోర్‌: 174/2
15 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ టైటాన్స్ రెండు వికెట్ల న‌ష్టానికి 174 ప‌రుగులు చేసింది. క్రీజులో జోస్ బ‌ట్ల‌ర్‌(40), రూథ‌ర్ ఫ‌ర్డ్‌(20) ప‌రుగుల‌తో ఉన్నారు.

సుద‌ర్శ‌న్ ఆన్ ఫైర్‌..
12 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ టైటాన్స్ వికెట్ న‌ష్టానికి 134 ప‌రుగులు చేసింది. క్రీజులో సాయిసుద‌ర్శ‌న్‌(74), జోస్ బ‌ట్ల‌ర్‌(25) ఉన్నారు. గుజ‌రాత్ విజ‌యానికి 46 బంతుల్లో 106 ప‌రుగులు కావాలి.

తొలి వికెట్ డౌన్‌..
శుబ్‌మ‌న్ గిల్ రూపంలో గుజ‌రాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది.  33 ప‌రుగులు చేసిన గిల్‌.. మాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి జోస్ బ‌ట్ల‌ర్ వ‌చ్చాడు. 7 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోర్‌: 75/1

దూకుడుగా ఆడుతున్న గుజ‌రాత్ ఓపెన‌ర్లు..
245 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ దూకుడుగా ఆడుతోంది. 5 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ వికెట్ న‌ష్ట‌పోకుండా 51 ప‌రుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌(27), సాయిసుద‌ర్శ‌న్(23) ఉన్నారు.

శ్రేయ‌స్‌, శశాంక్ విధ్వంసం.. గుజ‌రాత్ ముందు భారీ టార్గెట్
అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట‌ర్లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 243 ప‌రుగులు చేసింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌( 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌ల‌తో 97) అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. 
పంజాబ్ ఐదో వికెట్ డౌన్‌.. స్టోయినిష్ ఔట్‌
మార్క‌స్ స్టోయినిష్ రూపంలో పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 20 ప‌రుగులు చేసిన స్టోయినిష్‌.. సాయికిషోర్ బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరాడు. 16 ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌: 165/5. క్రీజులో కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌(66) ప‌రుగుల‌తో ఉన్నాడు.

కిషోర్ ఆన్ ఫైర్‌.. ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు
పంజాబ్ కింగ్స్ వ‌రుస క్ర‌మంలో రెండు వికెట్లు కోల్పోయింది. 11 ఓవ‌ర్ వేసిన సాయికిషోర్ బౌలింగ్‌లో మూడో బంతికి ఒమ‌ర్జాయ్‌(16), నాలుగో బంతికి గ్లెన్ మాక్స్‌వెల్‌(0) ఔట‌య్యాడు. 12 ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌:  108/4

పంజాబ్ రెండో వికెట్ డౌన్‌..
ప్రియాంష్ ఆర్య రూపంలో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. కేవ‌లం 20 బంతుల్లో 42  ప‌రుగులు చేసిన ప్రియాంష్‌.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 6 ఓవ‌ర్లు ముగిసే స‌రికి పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల‌ న‌ష్టానికి 73 ప‌రుగులు చేసింది. క్రీజులో శ్రేయ‌స్ అయ్య‌ర్‌(14), ఒమ‌ర్జాయ్‌(6) ప‌రుగుల‌తో ఉన్నారు.

తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్‌..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది.  5 ప‌రుగులు చేసిన ప్ర‌భుసిమ్రాన్.. ర‌బాడ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 4 ఓవ‌ర్లు ముగిసే స‌రికి పంజాబ్ కింగ్స్ వికెట్ న‌ష్టానికి 42 ప‌రుగులు చేసింది. క్రీజులో ప్రియాంష్ ఆర్య(17), శ్రేయ‌స్ అయ్య‌ర్‌(14) ప‌రుగుల‌తో ఉన్నారు.

ఐపీఎల్‌-2025లో అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌, పంజాబ్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజ‌రాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.  టీమిండియా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ గుజ‌రాత్ త‌ర‌పున అరంగేట్రం చేశాడు.

తుది జట్లు
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్‌), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, సూర్యాంశ్ షెడ్జ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(కెప్టెన్‌), జోస్ బట్లర్(వికెట్ కీపర్‌), సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement