IPL 2024: వెల్‌కమ్‌ బ్యాక్‌ పంత్‌.. బ్యాటింగ్‌లో తేలిపోయినా..! | IPL 2024: Delhi Capitals Captain Rishabh Pant Made His Come Back In A Match Vs Punjab Kings, Video Viral - Sakshi
Sakshi News home page

IPL 2024 PBKS Vs DC: వెల్‌కమ్‌ బ్యాక్‌ పంత్‌.. బ్యాటింగ్‌లో తేలిపోయినా..!

Mar 24 2024 10:23 AM | Updated on Mar 24 2024 1:17 PM

IPL 2024: Delhi Capitals Captain Rishabh Pant Made His Come Back In A Match Vs Punjab Kings - Sakshi

ఢిల్లీ ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌ చివరి బంతికి వార్నర్‌ అవుటయ్యాడు. ఆ తర్వాత అందరి దృష్టీ డగౌట్‌పై పడింది. రిషభ్‌ పంత్‌ హెల్మెట్‌ సరి చేసుకుంటూ మైదానంలోకి అడుగు పెట్టాడు. దాంతో ఒక్కసారిగా ముల్లన్‌పూర్‌ స్టేడియం మొత్తం మార్మోగిపోయింది. అభిమానులంతా నిలబడి స్టాండింగ్‌ ఒవేషన్‌తో స్వాగతం పలికారు. దాదాపు 15 నెలల విరామం తర్వాత క్రికెట్‌లోకి అడుగు పెట్టిన పంత్‌లో కూడా భావోద్వేగాలు కనిపించాయి.

బ్రార్‌ ఓవర్లో తన రెండో బంతికి సింగిల్‌ తీసి అతను పరుగుల ఖాతా తెరవడంతో అంతా చప్పట్లతో అభినందించారు. స్కోరు పరంగా పంత్‌ గొప్పగా ఆడకపోయినా...దాదాపు చావుకు చేరువైన కారు ప్రమాదంనుంచి కోలుకున్న తర్వాత ఇప్పుడు పూర్తి ఫిట్‌గా, కీపింగ్‌లోనూ చురుగ్గా కనిపించడం సానుకూలాంశం.  

కాగా, ముల్లన్‌పూర్‌ వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేకపోయారు.

33 పరుగులు చేసిన షాయ్‌ హోప్‌ టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. ఆఖర్లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన అభిషేక్‌ పోరెల్‌ (10 బంతుల్లో 32 నాటౌట్‌) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. పంజాబ్‌ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. రబాడ, హీర్ప్రత్‌ బ్రార్‌, రాహుల్‌ చాహర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని (175) ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌.. సామ్‌ కర్రన్‌ (63), లివింగ్‌స్టోన్‌ (38 నాటౌట్‌) రాణించడంతో 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌, కుల్దీప్‌ యాదవ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్‌ శర్మ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement