IPL 2023: రిషభ్ పంత్ స్థానంలో కొత్త కెప్టెన్ పేరును ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్

IPL 2023- Delhi Capitals New Captain: ఐపీఎల్-2023 సీజన్‌కు గానూ ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు సారథి పేరును ప్రకటించింది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్‌గా నియమించినట్లు తెలిపింది. అతడికి డిప్యూటీగా టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్‌గా అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కాగా ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ రిషభ్ పంత్ గతేడాది ఘోర రోడ్డుప్రమాదానికి గురైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో టీమిండియా పలు కీలక సిరీస్‌లతో పాటు ఐపీఎల్-2023 సీజన్ మొత్తానికీ దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో అనువభవజ్ఞుడైన వార్నర్ నాయకుడిగా జట్టును ముందుండి నడిపించనున్నాడు. కాగా గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా సేవలు అందించిన వార్నర్ 2016లో ఆ జట్టును చాంపియన్‌గా నిలిపిన విషయం తెలిసిందే.
ఇక గతేడాది పద్నాలుగింట ఏడు మ్యాచ్‌లు గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ చేరకపోయినప్పటికీ మెరుగైన ప్రదర్శనతో పర్వాలేదనిపించింది. అయితే, ఈసారి మాత్రం పంత్ రూపంలో కెప్టెన్‌తో పాటు కీలక బ్యాటర్ సేవలు కోల్పోవడంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
చదవండి: WTC Final: నంబర్ 1 బౌలర్ అశూ.. నంబర్ 1 ఆల్‌రౌండర్ జడ్డూ.. ఫైనల్లో ఆడేది ఎవరో ఒక్కరే!
LLC 2023: క్రిస్ గేల్ వీరవిహారం.. వయసు పెరుగుతున్నా తగ్గేదేలేదంటున్న యూనివర్సల్ బాస్
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు