IPL 2022 RR Vs RCB: Virat Kohli Stunning Back Tumbling Catch Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2022 RR Vs RCB: కోహ్లి స్టన్నింగ్‌ క్యాచ్‌.. వీడియో వైరల్‌

Apr 5 2022 9:10 PM | Updated on Apr 5 2022 10:31 PM

IPL 2022: Virat Kohli Out-Standing Back-Tumbling Catch Viral Vs RR - Sakshi

Courtesy{: IPL Twittet

ఐపీఎల్‌ 2022లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టార్‌ ఆటగాడు కోహ్లి స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌ హర్షల్‌ పటేల్‌ వేశాడు. అప్పటికే పడిక్కల్‌ 38 పరుగులతో మంచి ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఓవర్‌ ఆఖరి బంతిని పడిక్కల్‌ లాంగాన్‌ దిశగా భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. బ్యాట్‌ ఎడ్జ్‌కు తగలడంతో సరిగ్గా కనెక్ట్‌ కాలేదు. అయితే బౌండరీ లైన్‌ వద్ద ఉన్న కోహ్లి వెనక్కి పరిగెట్టి విల్లులా తిరిగి రెండు చేతులతో స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

కోహ్లి స్టన్నింగ్‌ క్యాచ్‌ కోసం క్లిక్‌ చేయండి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement